»A Cheetah Roaming In Jagithyala District Complaint Forest Officers
Jagithyala : జగిత్యాలలో చిరుత కలకలం
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో చిరుతపులి సంచారం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. మెట్ పల్లి మండలం సత్తక్కపల్లి, ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్, అమ్మక్కపేట్ గ్రామాల మధ్య ఉన్న చెరుకు తోటలో ఈరోజు కూలి పనికి వెళ్లిన ఓ మహిళకు చిరుత కనిపించింది.
Jagithyala : జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో చిరుతపులి సంచారం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. మెట్ పల్లి మండలం సత్తక్కపల్లి, ఇబ్రహీంపట్నం మండలం ఎర్రాపూర్, అమ్మక్కపేట్ గ్రామాల మధ్య ఉన్న చెరుకు తోటలో ఈరోజు కూలి పనికి వెళ్లిన ఓ మహిళకు చిరుత కనిపించింది. మహిళ భయంతో కేకలు వేయడంతో స్థానికులకు సమాచారం అందించింది. నాలుగైదు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో చిరుతపులి కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. అటవీ జంతువులు, జంతువుల పాదముద్రలను గుర్తించిన అధికారులు అవి ప్రాథమికంగా చిరుతపులి అని నిర్ధారించారు.
అయితే ప్రజలు భయపడవద్దని.. చిరుతపులి కనిపిస్తే మాత్రం హాని చేయవద్దని అటవీశాఖ అధికారులు కోరారు. అదేవిధంగా అటవీశాఖ అధికారులు కూడా తమ వంతుగా రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చిరుతపులి పాదముద్రలు గుర్తించిన ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాని కదలికలను పరిశీలిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో అటవీ జంతువుల సంచారంతో తీవ్రంగా భయపడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు చిరుత సంచరించినట్లు నిర్థారణ కావడంతో అటవీశాఖ అధికారులు వెంటనే పట్టుకుని రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.