డేట్ అంటే లవర్స్ వెళతారు. సరదాగా వెళ్లి కబుర్లు చెప్పుకుంటారు. ఓ కప్పు కాఫీని గంటలపాటు తాగుతారు. పెంపుడు జంతువులను ప్రేమించే వారు మాత్రం వెరైటీ. కొందరు అలానే బీహెవ్ చేస్తారు. ఎక్కడికి వెళ్లినా సరే తమ వెంట పెట్స్ తీసుకెళతారు. వెకేషన్, మూవీ ఇలా ఎక్కడికి అయినా సరే తమ వెంటే ఉండేలా చూసుకుంటారు. న్యూయార్క్‌లో ఒకతను తన పిల్లులను తీసుకొని కాఫీ షాపుకు వచ్చాడు. మూడు పిల్లులను తీసుకొని వచ్చిన అతను, వాటికి కాఫీ, ఫుడ్ తినిపించాడు.
పిల్లులతో తాను గడిపిన సమయాన్ని క్యాప్చర్ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇన్ స్టాగ్రామ్ పేజీ స్పాంగ్ కేక్ ద కాటిస్ఫోల్డ్ పేజీలో షేర్ చేయగా వైరల్ అవుతుంది. తనతో ఉన్న మూడు పిల్లుల పేర్లు స్పాంగే కేక్, మోచా, డొనట్ అని తెలిపారు. ‘మీరు న్యూయార్క్‌లో మాతో కాఫీకి జాయిన్ అవుతారా అని అడిగారు. హ్యాపీ క్యాచర్ డే అని తన పిల్లులకు అర్థం వచ్చేలా (శాటర్ డే) అని’ రాశాడు.
కాఫీ షాపులో ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్స్ పిల్లులు లాగించేశాయి. కాఫీ కూడా తాగాయి. అవి వీడియోలో కూడా స్పష్టంగా కనిపించాయి. వీడియోను ఈ నెల 14వ తేదీన షేర్ చేశారు. ఇప్పటికే 4.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ‘తన కోసం కూడా కేఫ్‌లో స్పేస్ ఉంచాలని మరొకరు రాశారు. ఇలా గడపడం తన కల అని మరొకరు అభిప్రాయపడ్డారు. న్యూయార్క్‌లో ఆ కేఫ్ మియామ్ మియావ్ అని సౌండ్ మాత్రమే వినిపిస్తోందని మరొకరు రాశారు. 10 నిమిషాల క్రితమే మేం మిస్ అయ్యాం, తన కుమారుడు వీడియో చూసి ఒక్కటే నవ్వుతున్నాడని పేర్కొన్నారు. ఆ పిల్లులను తాను చూడాల్సిందే’ అని నాలుగో వ్యక్తి కామెంట్ చేశారు.