తల్లిదండ్రులకు ఓ చిన్నారి(Children) సాయం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఈ వీడియోను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఓ సైకిల్(BiCycle)పై తల్లిదండ్రులు ప్రయాణిస్తుండగా ఆ వీడియో(Video)ను బైక్ పై వెళ్తున్న వ్యక్తి రికార్డు చేశారు. ఫ్లైఓవర్ పై సైకిల్ వెళ్తుండగా బాలుడు సైకిల్ ను తోసుకుంటూ వెళ్లాడు.
తల్లిదండ్రుల సైకిల్ సవారీకి సాయం చేస్తున్న చిన్నారి వీడియో:
కొడుకు సైకిల్ (BiCycle)ను తోస్తుంటే తండ్రి చిరునవ్వుతో ముందుకు సాగాడు. ఆ బాలుడు బాధ్యతగా సైకిల్ ను ముందుకు తోసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది. ఈ వీడియోకు నెటిజన్లు(Netizens) ఫిదా అవుతున్నారు. తల్లిదండ్రులకు జీవితాంతం బాసటగా నిలవాలని ఆ పోస్టుకు క్యాప్షన్(Caption) ఇచ్చారు.
బాలుడు(Son) తన తల్లిదండ్రులకు చేస్తున్న సాయంపై నెటిజన్లు(Netizens) విభిన్నంగా స్పందిస్తున్నారు. బాలుడికి పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం బాలుడు ఇలాంటి రిస్కులు చేయడం తప్పని కామెంట్స్(Comments) చేస్తున్నారు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 1.7 లక్షల వ్యూస్ వచ్చాయి.