SRD: సంగారెడ్డి పట్టణంలో గిరిజనులు బుధవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్ మాట్లాడుతూ.. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తెల్లం వెంకట్రావు, సోయం బాపురావులను కాంగ్రెస్ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.