»Video Shows Car Plunging Into Massive Crater In China
Viral Video: స్పీడ్‌గా వెళ్లి గొయ్యిలో పడ్డ కారు.. ఎక్కడంటే..?
రోడ్డుపై స్పీడ్‌గా వెళుతోన్న కారు నడుపుతున్న వ్యక్తి.. ముందట ఏర్పడిన గొయ్యిని గమనించలేదు. దీంతో కారు ఆ గొయ్యిలో పడిపోయింది. ఈ ఘటన చైనాలో గల హీలాంగ్జియాంగ్ వద్ద జరిగింది.
Video Shows Car Plunging Into Massive Crater In China
Viral Video: డ్రాగన్ కంట్రి చైనాలో (china) భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఇక ఈశాన్య చైనాలో అయితే పరిస్థితి చెప్పక్కర్లేదు. వరదనీరు పోటెత్తుతోంది. దీంతో రహదారులపై తీవ్ర ప్రభావం చూపాయి. వరదనీటితో హీలాంగ్జియాంగ్ వద్ద ప్రధాన రహదారి కొంతభాగం కోతకు గురయ్యింది. దానిని కారులో (car) వెళ్లే ప్రయాణికులు గుర్తించడం కష్టమే.. అలా ఓ కారు వచ్చి.. బోల్తా పడింది. ఆ వీడియోను (video) సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
హీలాంగ్జియాంగ్ వద్ద మెయిన్ రోడ్డుపై రెండు కార్లు (cars) వెళుతున్నాయి. ఓ కారును తెల్లని ఎస్యూవీ కారు ఓవర్ టేక్ చేసింది. వేగంగా వెళుతోంది. ముందర నల్లగా కనిపించగా.. అక్కడ నీరు ఉండి ఉంటుందని ఆ వెహికిల్ నడుపుతున్న వ్యక్తి భావించి ఉంటాడు. వేగాన్ని ఏ మాత్రం కంట్రోల్ చేసుకోలేదు. ఇంకేముంది స్పీడ్‌గా (speed) పోనిచ్చి.. అంతే స్పీడ్‌తో రహదారిపై ఏర్పడిన గొయ్యిలో కారుతో (car) సహా పడిపోయాడు. తన ముందటి కారు పడిపోవడంతో వెనకాల వచ్చిన కారు స్లో అయ్యింది. ఆ కారు డ్రైవర్ (driver) తన కారును కాస్త రివర్స్ తీసుకొని.. కిందకి దిగి మరీ చూశాడు. కొంచెంలో ప్రమాదం తప్పిందని అనుకున్నాడు.
గోతిలో పడిపోయిన కారు డ్రైవర్‌ను (car driver) స్థానికులు బయటకు తీశారు. మరో వీడియోలో మునిగిపోతున్న డ్రైవర్ కారుపై నిలబడి ఉన్నాడు. బయట ఉన్న కొందరు అతనికి తాడు ఇచ్చి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. చైనాలో భారీ వర్షాల వల్ల వరదలు పోటెత్తాయి. టైపూన్ డోక్సూరి వల్ల సూలాన్ అనే చోట ఇప్పటి వరకు వరదలు పోటెత్తాయని.. 14 మంది చనిపోయారని రాయిటర్స్ వార్తా సంస్థం పేర్కొంది. ఈశాన్య చైనా, బీజింగ్, హెబేలో కూడా వర్షాలు, వరదల ప్రభావం ఎక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా ఎంత మంది చనిపోయారనే అంశంపై మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.
షాక్ తిన్న మరో డ్రైవర్
ఆ కారు (car) మాత్రం రహదారిపై ఏర్పడిన గోతిలో పడింది. ఆ వెంటనే కారులో వచ్చిన మరొకరు దానిని చూసి షాక్ తిన్నాడు. రోడ్డు ఇలా దెబ్బతిందా అని అనుకున్నాడు. కాసేపు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. తర్వాత అధికారులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగారు. కారులో ఇరుక్కున్న వ్యక్తిని కాపాడారు.