»Vada Pav Ranked Among The Best Sadwiches In The World
Vada Pav : ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన వడాపావ్.. ఏంటి దీని ప్రత్యేకత?
వడాపావ్ గురించి ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలకూ తెలిసి.. దాన్ని టేస్ట్ చేస్తున్నారు. వేరే రాష్ట్రాల్లోనూ వడాపావ్ ఇప్పుడు దొరుకుతోంది. అయితే.. వడాపావ్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే బెస్ట్ సాండ్ విచ్ లలో వడాపావ్ కు చోటు దక్కింది
Vada Pav : వడాపావ్ తెలుసు కదా. మహారాష్ట్రకు చెందిన స్నాక్ ఐటెమ్. మనం బజ్జీలు, పకోడీలు, పునుగులు ఎలా స్నాక్ గా తింటామో.. మహారాష్ట్ర వాసులు వడాపావ్ ను అలా తింటారు. నిజానికి ఒకటి రెండు వడాపావ్ లు తింటే ఇక ఆరోజు అన్నం తినకున్నా కూడా ఆకలి కాదు. వడాపావ్ అంత హెవీగా ఉంటుంది. నేటికీ ముంబైలో ఉదయం ఒక వడాపావ్, రాత్రి ఒక వడాపావ్ తిని బతికే వాళ్లు లక్షల మంది ఉన్నారు. వడాపావ్.. మహారాష్ట్రీయుల ఇంటి వంటకం అయింది. అందుకే.. మహారాష్ట్రలో ఎక్కడ చూసినా రోడ్ల మీద వడాపావ్ ను అమ్ముతుంటారు.
వడాపావ్ గురించి ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలకూ తెలిసి.. దాన్ని టేస్ట్ చేస్తున్నారు. వేరే రాష్ట్రాల్లోనూ వడాపావ్ ఇప్పుడు దొరుకుతోంది. అయితే.. వడాపావ్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే బెస్ట్ సాండ్ విచ్ లలో వడాపావ్ కు చోటు దక్కింది. బెస్ట్ సాండ్ విచెస్ ఇన్ వరల్డ్ లిస్టులో వడాపావ్ కు 13వ స్థానం లభించింది. టాప్ 50 లో భారత్ నుంచి ఒక్క వడాపావ్ కి తప్పితే మరే స్నాక్ ఐటెమ్ కు గుర్తింపు లభించలేదు.
Vada Pav : 1960 లో వడాపావ్ తయారీ ప్రారంభం
ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ వద్ద 1960 లో ఒక స్ట్రీట్ వెండర్ అశోక్ వైద్య ఈ వడాపావ్ ను కనిపెట్టాడు. పావ్ అందరికీ తెలుసు కదా. ఆలు కూర్మాతో వడను చేసి ఆ వడను పావ్ మధ్యలో పెడతారు. అదే వడాపావ్. ఈ మధ్య ఈ వడాపావ్ ను ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా టేస్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. మహారాష్ట్రకు చెందిన ఈ వంటకానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు రావడం అనేది గ్రేట్. అందుకే.. వడాపావ్ ఇప్పుడు ఏ దేశం వెళ్లినా దొరుకుతోంది. అక్కడ ఉండే ఇండియన్స్, ఆ దేశాల వాళ్లు కూడా వడాపావ్ ఎలా చేయాలో నేర్చుకొని రెస్టారెంట్లలో అమ్ముతున్నారు.