»Twitter Introduce 2 Hours Video Upload Feature For Blue Tick Users
Twitter: యూజర్లకు మరో కొత్త ఫీచర్.. లాంగ్ వీడియో అప్లోడ్
యూజర్లకు మరో కొత్త ఫీచర్ తీసుకొచ్చింది ట్విట్టర్. 2 గంటల డ్యురేషన్ గల వీడియోలను అప్ లోడ్ చేసే అవకాశం ఇచ్చింది. బ్లూ టిక్ కలిగిన వినియోగదారులు మాత్రమే వీడియో పోస్ట్ చేసేందుకు వీలు కల్పించింది.
Twitter Introduce 2 Hours Video Upload Feature For Blue Tick Users
Twitter Upload Feature: ట్విట్టర్ (Twitter) యూజర్లకు ఎలాన్ మస్క్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై 2 గంటల వరకు వీడియో (video) అప్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అందరికీ మాత్రం కాదు.. కేవలం బ్లూ టిక్ (blue tick) తీసుకున్నవారికి మాత్రమే వీడియో పోస్ట్ చేయవచ్చు. బ్లూ టిక్ యూజర్స్ 2 గంటలు లేదంటే 8 జీబీ ఉన్న వీడియోలు అప్ లోడ్ చేసే అవకాశం ఉంది.
ట్విట్టర్ బ్లూ టిక్ (twitter blue tick) యూజర్లు ట్వీట్లను ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. బ్లూ టిక్ లేని యూజర్ కేవలం 140 సెకన్లు అంటే 2.20 నిమిషాల వీడియోలను అప్ లోడ్ చేయవచ్చు. నగదు చెల్లించని ప్రముఖులకు బ్లూ టిక్ తీసివేసిన సంగతి తెలిసిందే. లాంగ్ వీడియో అప్ లోడ్ చేసే టెక్నాలజీ కావాలని వినియోగదారులు కోరుతున్నారు. వారి సూచనల మేరకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మాస్క్ (elon musk) ఈ నిర్ణయం తీసుకున్నారు.
బ్లూ టిక్ అంటే ప్రముఖుల పేరుతో ఉండే ఒరిజనల్ అకౌంట్ అని అర్థం. వారి ఫాలొవర్లు, ఫ్యాన్స్‌కు మెసేజ్ చేస్తే ఈజీగా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. అంతకుముందు బ్లూ టిక్ ఉన్న నగదు చెల్లించాల్సి ఉండేది కాదు. మస్క్ పగ్గాలు చేపట్టిన తర్వాత సంస్కరణలు చేపడుతూ వచ్చారు. అందులో భాగంగా బ్లూ టిక్ కోసం డబ్బులు చెల్లించని వారిపై కఠినంగా వ్యవహరించారు.