RRR హాట్ టాపిక్‌గా మారిన RRR ఖర్చు.. తమ్మారెడ్డిపై ఫైర్!
RRR : ప్రస్తుతం కేవలం తెలుగు వారు మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తం ఆస్కార్ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తోంది. ఈసారి మనకు ఆస్కార్ రావడం పక్కా అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నాటు నాటు సాంగే కనిపిస్తోంది.
ప్రస్తుతం కేవలం తెలుగు వారు మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తం ఆస్కార్ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తోంది. ఈసారి మనకు ఆస్కార్ రావడం పక్కా అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నాటు నాటు సాంగే కనిపిస్తోంది. మరోవైపు చరణ్, తారక్ ఇద్దరు అమెరికాలో ఆస్కార్ ప్రమోషన్స్ ఓ రేంజ్లో చేస్తున్నారు. మనోళ్లు ఆస్కార్ అందుకొని చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఆస్కార్ వచ్చినా, రాకపోయినా ఆర్ఆర్ఆర్ మాత్రం ఓ సంచలనం అని చెప్పొచ్చు. కానీ సీనియర్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం ఆర్ఆర్ఆర్(RRR) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవార్డు కోసం ఆర్ఆర్ఆర్(RRR) టీమ్ పెడుతున్న ఖర్చుతో.. ఏకంగా 8 సినిమాలు తీయొచ్చని చెప్పారు. ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. దీనిపై చాలా మంది సినీ ప్రముఖులు స్పందిస్తున్నాదు. మెగా బ్రదర్ నాగబాబు.. పొలిటికల్ యాంగిల్లో బూతు మాటలతో ఫైర్ అయ్యారు. అలాగే రాఘవేంద్ర రావు కూడా ట్విట్టర్ వేధికగా స్పందించారు. మిత్రుడు తమ్మారెడ్డి భరద్వాజ్.. ప్రపంచ వేదికలపై మనోళ్ల పేర్లు చూసి గర్వ పడాలని అన్నారు. అలాగే 80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి.. మీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. జేమ్స్ కామెరూన్ స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారా.. అంటూ ఫైర్ అయ్యారు. వీళ్లే కాదు నెటిజన్స్ కూడా దీనిపై మండి పడుతున్నారు. ఏదేమైనా.. ట్రిపుల్ ఆర్(RRR) టీమే కాదు.. ఈ మూమెంట్‌ను ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇదే.