కర్ణాటక(Karnataka)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వెళ్లున్న కారు, బైక్‌ను ఇద్దరు విద్యార్థులను ఢీ కొట్టిన ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. రాఘవేంద్ర పెట్రోల్ బంకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ఎదురుగా వస్తున్న ట్రాఫిక్‌ను పట్టించుకోకుండా బైకర్ రద్దీగా ఉండే రోడ్డులో సడెన్‌గా యూ టర్న్ (U turn) తీసుకోవడంతో ప్రమాదం జరిగింది. కారు ఢీ కొట్టగానే బైక్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది.రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు విద్యార్ధినుల(Students)ను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకర్‌కి తీవ్ర గాయాలు కాగా, విద్యార్థినులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రాయచూరు (Raichur) ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై కేసు నమోదైంది.@DeshmukhHarish9 అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.