»The River That Turned Into Blood People With Fear
River: రక్తంలా మారిన నది..భయంతో ప్రజలు!
నదిలోని నీరంతా రక్తంలా మారిపోవడంతో స్థానికులు టెన్షన్ పడ్డారు. ఆ నదిలో ఏమైనా జరిగి ఉంటుందా అని భయపడ్డారు. ఎవరినైనా చంపేసి ఉంటారా అని అనుమానించారు. అయితే అవేవీ కారణం కాదు. ఆ నదిలో నీరు అలా మారడానికి పక్కనున్న బీర్ ఫ్యాక్టరీయే కారణం అని తేలింది.
ఓ నది(River)లోని నీరు రక్తం(Blood)లా మారిపోయింది. నదిలోని నీరు ముదురు ఎరుపు రంగులోకి మారడంతో స్థానికులు భయాందోళన చెందారు. ఈ ఘటన జపాన్ (Japan)లోని నాగో సిటీ(Nago city)లో చోటుచేసుకుంది. పైనాపిల్ తోటలకు నాగో సిటీ ఫేమస్. ప్రస్తుతం ఆ నదికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్(Photos Viral) అవుతున్నాయి. ఆ నదిలో నీరు ముదురు ఎరుపు రంగులోకి మారడానికి కారణం దగ్గర్లో ఉన్న ఒరియాన్ బీర్ ఫ్యాక్టరీయేనని(Orion Beer Factory) తేలింది.
ఒరియాన్ బీర్ ఫ్యాక్టరీ(Orion Beer Factory) వద్ద కూలింగ్ వ్యవస్థలో ఒకదానిలో లీకేజీ(Leakage) ఏర్పడింది. ఆహార పదార్థాల్లో ఉపయోగించే ప్రొపిలిన్ గ్లైకాన్(Profilion glycon) అనే రసాయన ద్రావణం పొరపాటున లీక్(Leak) అయ్యింది. అయితే ఆ ద్రావణం నది(River)లోకి విడుదల కావడంతో నదిలోని నీరంతా ముదురు ఎరుపు రంగులోకి మారిపోయింది.
ఈ ఘటనతో స్థానిక ప్రజలు బీర్ ఫ్యాక్టరీ(Beer Factory)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒరియాన్ బీర్ ఫ్యాక్టరీ(Orion Beer Factory) యాజమాన్యం స్పందిస్తూ క్షమాపణలు చెప్పింది. దానికి సంబంధించిన ఓ లేఖను కూడా విడుదల చేసింది. లీక్(leak) అవ్వకుండా మరమ్మతులు చేశామని, ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపింది.