»The Father Who Was Going To Give Slips To His Son Was Crushed By The Police
Viral Video: కొడుక్కి స్లిప్లు ఇవ్వబోయిన తండ్రి..చితకబాదిన పోలీసులు
పరీక్ష(Exams)లంటే చాలా మందికి భయం. పబ్లిక్ పరీక్షలంటే పిల్లల కంటే వారి తల్లిదండ్రుల్లో కాస్త టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. తమ పిల్లలు పరీక్ష బాగా రాయాలని వారి తల్లిదండ్రులు(Parents) దేవుళ్లకు మొక్కుతుంటారు. వాళ్లకు మంచి మార్కులు(Marks) రావాలని వేడుకుంటూ ఉంటారు. తమ పిల్లల పరీక్షను వాళ్ల సొంత పరీక్షలాగా ఫీల్ అయిపోతుంటారు. ఇలాంటి అన్ని చోట్లా జరిగేదే. కానీ ఇక్కడ మాత్రం ఓ తండ్రి తన కొడుకు పరీక్ష(Exams) పాస్ కావడం కోసం స్వయంగా స్లిప్పులు పెట్టి ఇచ్చే ప్రయత్నం చేశాడు. తీరా ఆ తండ్రి చేయాలనుకున్న పని బెడిసికొట్టింది. పోలీసులు ఆ తండ్రిని లాఠీలతో చితకబాదారు.

మహారాష్ట్రలోని జల్గావ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని పోలీసులు లాఠీలతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. ఆ తండ్రి తన కుమారుడి పరీక్ష హాలు(Exam Hall)కు వెళ్లి చిట్టీలు అందించాలనుకున్నాడు. బోర్డు పరీక్షల్లో భాగంగా మ్యాథమెటిక్స్ పేపర్ కావడం వల్ల తన కొడుకు ఫెయిల్ అవుతాడని గ్రహించిన ఆ తండ్రి(Father) చిట్టీలు ఇచ్చే ప్రయత్నం చేశాడు. కొడుకు కోసం గదిలో వెతుకుతుండగా పోలీసులు పట్టుకుని వార్నింగ్ ఇచ్చి పంపారు.
పోలీసులు(Police) ఎంత చెప్పినా ఆ తండ్రి(Father) వినకుండా మళ్లీ కొద్దిసేపటికి స్లిప్పులు తీసుకుని పరీక్షా కేంద్రానికి వెళ్లాడు. దీంతో పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పారిపోయాడు. ఇలా ఒకటి రెండు సార్లు చెప్పినా ఆ వ్యక్తిలో మార్పు రాలేదు. పోలీసులు ఇక లాభం లేదని తెలిసి ఆ వ్యక్తికి లాఠీలతో బుద్ధి చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.
కొడుకు కోసం స్లిప్పులు తెచ్చిన తండ్రిని కొడుతున్న పోలీసులు: