»Wives Of Jawans Who Died In 2019 Pulwama Attack Have Asked For Permission To Commit Suicide
Pulwama Attack: ఆత్మహత్యకు అనుమతి కోరిన అమర జవాన్ల భార్యలు
2019 పుల్వామా దాడి(Pulwama attack) ఘటన దేశాన్ని కుదిపేసింది. ఆ ఘటనలో 40 మంది భారత జవాన్లు(Indian soldiers) అమరులయ్యారు. పుల్వామా దాడి(Pulwama attack) జరిగి మూడేళ్లు అవుతున్నా అమరులైన జవాన్ల భార్యలకు ఇంత వరకూ పరిహారం అందలేదు. దీంతో మరణించిన సీఆర్పీఎఫ్(CRPF) జవాన్ల భార్యలు, కుటుంబ సభ్యులు రాజ్ భవన్ కు వెళ్లి మధ్యప్రదేశ్ రాజస్థాన్ గవర్నర్ కల్రామ్ మిశ్రాకు వినతి పత్రం అందించారు.

తాము ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ వేడుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో చావడం తప్పా తమకు వేరే దారి కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వేడుకున్నారు.
తమ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం, తమ భర్తల పేరుపై స్మారకాలు నిర్మిస్తామని చెప్పి ఈ రోజు వరకూ ప్రభుత్వం పట్టించుకోలేదని వీర జవాన్ల భార్య(Jawans Wives)లు వాపోయారు. రాజ్ భవన్ నుంచి వారు బయటకు వచ్చాక నేరుగా రాజస్థాన్ సీఎం ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు(Police) వారిని అడ్డుకుని అదుపు చేశారు.
పోలీసులు అమర జవాన్ల భార్యల(Jawans Wives)ను తోసివేశారు. ఈ ఘటనలో వీర జవాన్ రోహితాశవ్ లాంబా భార్య మంజు గాయపడింది. గత కొన్ని రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని వీర జవాన్ల భార్య(Jawans Wives)లు ధర్నా చేస్తున్నా ఆ రాష్ట్ర సర్కార్ స్పందించలేదు. బీజేపీ(BJP) స్పందిస్తూ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్(Congress) ప్రభుత్వం వీర జవాన్ల కుటుంబాల(Jawans Families) డిమాండ్లు నెరవేర్చడానికి బదులుగా వారితో దురుసుగా ప్రవర్తించిందని ఆరోపణలు చేయడానికే పరిమితం అయ్యింది.