మనం రోజూ ఉపయోగించే పెన్ను(Pen) ధర పదో పాతికో ఉంటుంది. కొన్ని ప్రత్యేక కార్యక్రమాలప్పుడు గిఫ్ట్ గా పెన్ను ఇవ్వాలనుకుంటే వందో రెండొందలో పెట్టి పెన్నును కొనుగోలు చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పెన్ను(Pen) ధర ఏకంగా రూ.22.47 లక్షలు. ఇది విన్నాక మీరు అవాక్కయ్యారు కదా. వినేందుకు విడ్డూరంగా ఉన్నా ఇదే నిజమండి. అక్షరాల ఆ పెన్ను(Pen) ధర రూ.22 లక్షలపైనే.

ఇంత భారీ ధర ఉండే ఈ పెన్ను(Pen)కు ఓ ప్రత్యేకత ఉంది. పెన్ను మొత్తం బంగారం(Gold)తో చేశారని అస్సలు అనుకోకండి. ఈ పెన్నును బంగారం కంటే ఇంకా విలువైన దానితో తయారు చేయడం విశేషం. ఇటువంటి భారీ ధర పలికే పెన్ను(Pen)ను తయారు చేసింది సాధారణ కంపెనీ మాత్రం కాదు. ప్రపంచంలోనే అతి ఖరీదైన కార్లు కంపెనీ అయిన ఫెరారీ(Ferrari) కంపెనీ భారీ ధర పలికే పెన్నును రెడీ చేసింది.
మాంట్ బ్లాంక్ కంపెనీతో కలిసి ఫెరారీ(Ferrari) కంపెనీ రూ.22.47 లక్షలు విలువ చేసే పెన్ను(Pen)ను తయారు చేసింది. ఈ పెన్ను పేరు ‘ది మాంట్ బ్లాంక్ ఫెరారీ స్టైలెమా ఎస్పీ 3’. ఇటువంటి పెన్నును డేటోన ఎస్పీ3 కారు స్పూర్తితో తయారు చేసినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ పెన్ను(Pen) మూతను టైటానియంతో తయారు చేయగా, ములుకును తెల్ల బంగారంతో తయారు చేసింది.
ఇంత ఖరీదైన పెన్ను(Pen)లో ఇంకు నింపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసింది. రక్షణగా పెన్ను మధ్యలో అమర్చేటటువంటి రెడ్ బ్లేడ్ ఫెరారీ(Ferrari) కార్లను సూచించనుంది. తక్కువ సంఖ్యలోనే ఈ పెన్నులను రిలీజ్ చేయనుండటం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 599 పెన్ను(Pen)లను మాత్రం ఆ సంస్థ అందుబాటులోకి తెస్తోంది. ఇంత ఖరీదైన పెన్నులను మాంట్ బ్లాంక్ డాట్ కామ్ అనే వెబ్ సైట్ ద్వారా ఆ సంస్థ అమ్ముతోంది.