Pakistan : పాకిస్థాన్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?
లీటర్ డీజిల్ ధర 280 పాకిస్థానీ రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల బంగారం ధర చూసుకుంటే అంటే తులం బంగారం ధర 24 క్యారెట్లకు 2 లక్షల పాకిస్థానీ రూపాయలకు చేరుకుంది. వస్తువుల ధరలు పెరుగుతూ పోతుంటే పాకిస్థాన్ కరెన్సీ మాత్రం దారుణంగా పడిపోయింది..
Pakistan : పాకిస్థాన్.. ఈ పేరు ఎత్తితేనే మనకు చిరాకు వేస్తుంది. ఇదేం దేశం అంటూ మాట్లాడుతాం. కానీ.. ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి ఏం బాగోలేదు. బార్డర్ దగ్గర పాకిస్థాన్ సైనికులు చేసే దుశ్చర్య ఎలా ఉంటుందో.. ఎలా దొంగ దెబ్బ తీసి భారత్ లోకి ప్రవేశించాలని చూస్తారో ప్రతి భారతీయుడికి తెలుసు. కానీ.. పాకిస్థాన్ దేశం ప్రస్తుతం ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుంది. అక్కడ ద్రవ్యోల్బణం కొండెక్కింది. ఎప్పుడూ లేనంతగా ద్రవ్యోల్బణం పెరగడంతో అక్కడి వస్తువుల రేట్లు కూడా అమాంతం పెరిగిపోయాయి. 50 సంవత్సరాల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం చేరుకుంది.
దాని వల్ల.. లీటర్ డీజిల్ ధర 280 పాకిస్థానీ రూపాయలకు చేరుకుంది. ఇక పది గ్రాముల బంగారం ధర చూసుకుంటే అంటే తులం బంగారం ధర 24 క్యారెట్లకు 2 లక్షల పాకిస్థానీ రూపాయలకు చేరుకుంది. వస్తువుల ధరలు పెరుగుతూ పోతుంటే పాకిస్థాన్ కరెన్సీ మాత్రం దారుణంగా పడిపోయింది. ఆర్థిక సంక్షోభం వల్ల పాకిస్థాన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
Pakistan : అప్పు కోసం పాకిస్థాన్ విశ్వ ప్రయత్నాలు
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్థాన్ ఇప్పుడు అప్పు కోసం ప్రపంచ దేశాల ముందు చేయి చాచుతోంది. ఐఎంఎఫ్ లోన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా.. కొన్ని షరతులు పెట్టడంతో పాక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిత్యావసరాల సరుకులు దొరక్క, పెరిగిన ధరలతో కొనుక్కోలేక పాకిస్థాన్ ప్రజలు నరకం చూస్తున్నారు. మెడిసిన్ మ్యానుఫాక్చరింగ్ కూడా ఆగిపోయింది. దీంతో దేశంలో భారీగా మెడిసిన్ కొరత ఏర్పడుతోంది. బ్యాంకులు కూడా వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. అలాగే పన్ను వసూళ్లను భారీగా రాబట్టాలని పాకిస్థాన్ ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.