Schemes For Women: మహిళలకు గుడ్ న్యూస్..కేంద్రం అందిస్తోన్న అద్భుత స్కీమ్స్ ఇవే
చాలా మంది మహిళలకు కేంద్రం అందిస్తున్న పథకాలు(Schemes For Women) తెలియడం లేదు. దాని వళ్ల వారు చాలా నష్టపోతున్నారు. మహిళ సంక్షేమం కోసం, మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక స్కీమ్స్(Womens schemes) ను ప్రారంభించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది మహిళలకు కేంద్రం అందిస్తున్న పథకాలు(Schemes For Women) తెలియడం లేదు. దాని వళ్ల వారు చాలా నష్టపోతున్నారు. మహిళ సంక్షేమం కోసం, మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక స్కీమ్స్(Womens schemes) ను ప్రారంభించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళా సమ్మాన్ బచత్ పత్ర స్కీమ్ (Mahila Samman Bachat Patra):
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం కొత్తగా ఓ స్కీమ్ ను అందుబాటులోకి తెచ్చింది. ఆ స్కీమ్ పేరే మహిళా సమ్మాన్ బచత్ పత్ర స్కీమ్. 2023 బడ్జెట్ లో ఈ స్కీమ్ కు సంబంధించిన ప్రకటనను కేంద్రం వెల్లడించింది. ఇదొక వన్ టైమ్ స్మాల్ సేవింగ్ స్కీమ్ అని చాలా మందికి తెలియదు. ఈ స్కీమ్ రెండు సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది. 2025 మార్చి వరకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ఇందులో మహిళలు రూ.2 లక్షల వరకూ డబ్బులు దాచుకుని ఆదా చేసుకోవచ్చు. ఈ మొత్తానికి కేంద్రం 7.5 శాతం వరకూ వడ్డీని అందిస్తోంది. అదేవిధంగా ఈ అమౌంట్ ను కావాల్సిన సమయంలో విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది.
సుకన్య సమృద్ధి స్కీమ్ (Sukanya Samriddhi Yojana):
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమ్మాయిల కోసం ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆడ పిల్లల పేరుపై పదేళ్లలోపు వయసున్న వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తించనుంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం 21 ఏళ్లు కాగా స్కీమ్ లో చేరాక 15 ఏళ్ల వరకూ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా 7.6 శాతం వడ్డీని కేంద్రం చెల్లిస్తుంది. ఒక ఏడాదిలో రూ.1.5 లక్షల దాకా డబ్బులు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది.
బేటి బచావో బేటి పడావో (Beti Bachao Beti Padhao):
బేటి బచావో బేటి పడావో అనే స్కీమ్ ను ఆడ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ఆడ పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో గుర్తిస్తూ తెరపైకి వచ్చింది. లింగ వివక్ష లేకుండా చూడటం, ఆడ పిల్లల రక్షణ వంటి లక్ష్యాలతో ఈ స్కీమ్ ను కేంద్రం అమలు చేస్తోంది. పిల్లలు చదువుకు దూరం కాకుండా వారి ఉన్నత విద్యకు ఈ స్కీమ్ ఎంతగానో తోడ్పడుతుంది.
సఖి నివాస్ (Sakhi Niwas):
సఖి నివాస్ అనే స్కీమ్ ను వర్కింగ్ ఉమెన్స్ కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వర్కింగ్ ఉమెన్స్ కి అకామిడేషన్, వారి పిల్లలకు డే కేర్ ఫెసిలిటీ వంటివి ఈ స్కీమ్ ద్వారా కల్పిస్తారు. అలాగే ఈ స్కీమ్ కింద కొత్త హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణాలు చేపట్టడం, ప్రస్తుత హాస్టల్స్ విస్తరించడం వంటివి చేస్తున్నారు. కుల మత బేధాలు లేకుండా వర్కింగ్ ఉమెన్స్ అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద అందుబాటులోకి తెచ్చిన హాస్టల్స్ వర్కింగ్ ఉమెన్స్ కు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ (One Stop Centre Scheme):
వన్ స్టాప్ సెంటర్ స్కీమ్ అనేది నిర్భయ ఫండ్‌తో నడపబడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలకు 100 శాతం కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తూ ఈ స్కీమ్ ను నడుపుతోంది. హింస కారణంగా బాధింపబడిన మహిళలకు ఈ స్కీమ్ కింద ఊరట లభించడమే కాకుండా వారికి అవసరమైన ఎమర్జెన్సీ మెడికల్, చట్టబద్దమైన సాయం, కౌన్సిలింగ్, నాన్ ఎమర్జెన్సీ సేవలు అందించనున్నారు. బాధింపబడిన మహిళలకు ఈ స్కీమ్ చేయూతను అందిస్తుంది. వారి అభివృద్ధికి సహకరిస్తుంది.
ఉమెన్ హెల్ప్ లైన్ స్కీమ్ (Women Helpline Scheme):
మహిళలు ఎక్కువగా హింసకు గురవుతున్నారు. ప్రైవేటు లేదా పబ్లిక్ ప్లేసుల్లో హింసకు గురైన మహిళల కోసం ఉమెన్స్ హెల్ప్ లైన్ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. హింసకు గురైన మహిళలకు ఈ స్కీమ్ ద్వారా ఊరట లభిస్తుంది. 181 టోల్ ఫ్రీ నెంబర్ ఈ స్కీమ్ కోసం ఏర్పాటు చేశారు. ఈ స్కీమ్ ద్వారా మహిళలను కేంద్రం సపోర్ట్ చేస్తూ వారిని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది.