»Bahubali Gujiya Eating Competition Before Holi Lucknow Uttar Pradesh
bahubali gujiya:హోలీకి ముందే బాహుబలి గుజియా తిండి పోటీ
యూపీలోని లక్నో(lucknow)లో హోలీ(holi) పండుగకు ముందే పండుగ వాతావరణం మొదలైంది. ఈ క్రమంలో ఓ స్వీట్ షాపు(sweet shop)లో వినూత్నంగా బహుబలి గుజియా(bahubali gujiya)ను తినాలని తిండి పోటీని శనివారం నిర్వహించారు. దీంతో కస్టమర్లు(customers) తినేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్(uttar pradesh) రాజధాని లక్నో(lucknow)లో హోలీ పండుగకు ముందే సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఓ స్వీట్ షాపులో వినూత్నంగా బహుబలి గుజియా(bahubali gujiya)ను తినాలని తిండి పోటీని శనివారం నిర్వహించారు. ఈ క్రమంలో గుజియా(bahubali gujiya)ను తినేందుకు వినియోగదారులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పోటీ పడ్డారు. ఆ నేపథ్యంలో దానిని తింటూ పోటీదారులు రుచిని ఆస్వాదించారు. మరికొంత మంది స్పీడుగా గుజియాను తినేందుకు నీళ్లు తాగుతూ కనిపించారు. అయితే ప్రైజ్ మనీ(prize money) లాంటి వివరాలు మాత్రం లేవని తెలుస్తోంది.
#WATCH | UP: A sweet shop in Lucknow organised 'Bahubali Gujiya' eating competition ahead of Holi (04/03) pic.twitter.com/fxtttkyOuE
బహుబలి గుజియాను కొన్ని రోజుల క్రితం లక్నో(lucknow)లోని ఓ స్వీట్ షాప్(sweet shop) పరిచయం చేసింది. దాని పరిమాణం, బరువు కారణంగా దీనికి ఈ పేరుపెట్టినట్లు వారు తెలిపారు. అయితే గుజియా బరువు 2 కిలోలుగా ఉంటుందని వారు చెబుతున్నారు. దాని ఖరీదు రూ.1500 నుంచి రూ.6000 వేల వరకు పలు రకాల పరిణాల్లో అందుబాటులో ఉన్నట్లు స్వీట్(sweet) షాప్(shop) నిర్వహకులు వెల్లడించారు.
పెద్దగా కనిపించే ఈ గుజియా(bahubali gujiya)లో ఖోయా, కేసర్, బాదం, పిస్తా, పంచదారతో నిండి ఉంటుందని తెలిపారు. అయితే ఒక్క ముక్కను డీప్ ఫ్రై చేయడానికి వారికి దాదాపు 20-25 నిమిషాల సమయం పడుతుందని చెప్పారు. ఇలా ప్రతి సంవత్సరం కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఏదో ఒక వంటకాన్ని ప్రవేశపెడుతున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. గుజియాను కరంజీ అని కూడా పిలుస్తారు. ఇది ఆకలి పుట్టించే వంటకమని కూడా చెబుతున్నారు. ఇక హోలీ(holi) పండుగ దేశవ్యాప్తంగా మార్చి 8న జరుగనుంది.