ఆస్ట్రేలియా(Australia)లోని సిడ్నీ విమానాశ్రయం నుండి కౌలాలంపూర్‌కు ఫ్లైట్‌లో బయలుదేరాడు ఓ వ్యక్తి. టేకాఫ్ అయిన కాసేపటికి విమానాన్ని పేల్చివేస్తానని గట్టిగా అరిచాడు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే సిబ్బంది అతని లగేజీని తనిఖీ చేశారు. కానీ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
ఆ తర్వాత విమానాన్ని వెనక్కి మళ్లించి అతడిని దించేశారు. పోలీసులు (Police) అతడిని కస్టడిలోకి తీసుకున్నారు. ప్రయాణికులను మరో విమానంలో గమ్యస్థానానికి పంపించే ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉండగా మహమ్మద్ ఆరిఫ్ (Mohammed Arif) పాకిస్థాన్‌కు చెందిన నటుడు. రెండు దశాబ్దాల క్రితం ఓ మ్యూజిక్ ఆడియో(Music audio)లోనూ కనిపించాడు. ప్రస్తుతం అతను నటనకు దూరంగా ఉన్నాడు. నిందితుడిని పాకిస్థాన్‌కు చెందిన నటుడిగా గుర్తించారు. అతను మానసికవ్యాధి(mental illness)తో బాధపడుతున్నట్లు అతడి న్యాయవాది తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.