»Thakor Community Bans On Girls Using Mobile Phone
Shocking: ఇకపై అమ్మాయిలు Mobile Phone వాడొద్దు.. డీజేలు వద్దు
ఈ సందర్భంగా తమ ప్రజలకు 11 నియమాలు విధించారు. వీటిని విధిగా కట్టుబడి ఉండాలని ఆదేశించారు. వీటిని పాటిస్తామని అందరితో ప్రమాణం చేయించారు. అయితే సమాజ్ పెద్దలు విధించిన 11 నిబంధనలు వివాహానికి సంబంధించినవి ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి..
భారతదేశం అన్ని సామాజిక వర్గాల కలయిక. అందుకే ప్రపంచంలోనే ప్రత్యేకతతో భారతదేశం ఉంది. వసుధైక కుటుంబంగా మనదేశాన్ని వర్ణిస్తారు. ఎన్నో సమాజాలు, కులాలు, సామాజికవర్గాలు ఉన్నాయి. ఒక్కో సామాజికవర్గానిది, తెగది ఒక్కో సంప్రదాయం, పద్ధతులు ఉన్నాయి. నేటి ఆధునిక సమాజంలోనూ ఆయా సమాజాల్లో స్త్రీని ఇంటికే పరిమితం చేస్తున్నారు. స్త్రీపై ఆంక్షలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఓ తెగ తమ అమ్మాయిలకు ఫోన్లు ఇవ్వవద్దని ఆల్టిమేటం జారీ చేసింది. దీంతో పాటు మొత్తం 11 నిమయాలను అమ్మాయిలపై విధించింది. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్ (Gujarat)లో ఠాకోర్ సమాజ్ (Thakor Community) జనాభా మోస్తరుగా ఉంటుంది. ఈ సమాజ్ ప్రజలు ఇంకా తమ సంప్రదాయ పద్ధతులను నిష్టగా పాటిస్తున్నారు. పూజలు, పండుగలు వంటివి అందరూ కలిసి మెలిసి చేసుకుంటారు. అయితే ఇటీవల బనాస్ కంఠ జిల్లా (Banaskantha District) బాబార్ (Babar) ప్రాంతంలోని లున్ సేలాలో జరిగిన ఓ వేడుకలో ఈ సమాజ్ పెద్దలంతా కీలక నిర్ణయం తీసుకున్నారు. సంత్ శ్రీ సదరమ్ బాపా విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవం ఘనంగా నిర్వహించిన అనంతరం ఈ సమాజ్ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రజలకు 11 నియమాలు విధించారు. వీటిని విధిగా కట్టుబడి ఉండాలని ఆదేశించారు. వీటిని పాటిస్తామని అందరితో ప్రమాణం చేయించారు. అయితే సమాజ్ పెద్దలు విధించిన 11 నిబంధనలు వివాహానికి సంబంధించినవి ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి..
ఠాకోర్ సమాజ్ 11 సూత్రాలు
– వివాహ వేడుకల్లో డీజే సౌండ్ లు పూర్తిగా బంద్
– పెళ్లిళ్లకు బహుమతులు వద్దు. వాటికి బదులుగా నగదు ఇవ్వాలి.
– పెళ్లి కట్నకానుకల్లో వధూవరులు నిత్యం ఉపయోగించే వస్తువులను మాత్రమే బహుమతులుగా అందించాలి.
– నిశ్చితార్థానికి 11 మంది అతిథులు మాత్రమే ఉండాలి.
– వివాహ వేడుకకు 51 మంది అతిథులు మాత్రమే హాజరుకావాలి.
– సామాజిక వర్గాల వారీగా సామూహిక పెళ్లిళ్లు చేయాలి.
– కొత్త దంపతులు ఇళ్లకు వస్తే బంధువులు నగదు ఇవ్వవద్దు.
– అనుకోకుండా నిశ్చితార్థం, వివాహాన్ని రద్దు చేసుకుంటే శిక్షలు విధించవద్దు.
– పెళ్లి కాని యువతులకు ఫోన్ వాడేందుకు అనుమతి ఇవ్వవద్దు.
– మత్తు పదార్థాలకు బానిసలైన వారికి పునరావాస శిబిరాలు నిర్వహించాలి.
– చదువుకోవడానికి వెళ్లే బాలికలకు ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు ప్రతి గ్రామంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.