Teacher Student Marriage : క్లాస్ టీచర్ని పెళ్లాడిన స్టూడెంట్.. వీళ్లదో వెరైటీ లవ్ స్టోరీ
అతనికి 22.. ఆమెకు 48.. ఆమె అతనికి చిన్ననాటి క్లాస్ టీచర్. అయినా వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ వింత ప్రేమ కథను చదవండి.
Teacher Student Marriage : సినిమాల ప్రభావమో మరేమో గానీ ఈ మధ్య కాలంలో గురుశిష్యుల సంబంధానికి అర్థం మారిపోయింది. ఉపాధ్యాయులంటే విద్యార్థులకు గౌరవం తగ్గిపోతోంది. వారిపై కౌంటర్లు వేయడం మామూలైపోయింది. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. స్టూడెంట్లు టీచర్లను పెళ్లి చేసుకున్న వార్తలు వింటూనే ఉన్నాం. ఇలాంటిదే మలేషియాలో ఓ విచిత్రమైన పెళ్లి జరిగింది. 22 ఏళ్ల వ్యక్తితో 48 ఏళ్ల టీచర్‌కి పెళ్లి జరిగింది.
వీరి విచిత్ర ప్రేమ కథ వింటే ఆశ్చర్యపోక తప్పదు. మొహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ వయస్సు 22ఏళ్లు. అతని క్లాస్ టీచర్ జమీలాకి 48 ఏళ్లు.. 2016లో అతను తను చదువుకున్న స్కూల్‌కి వెళ్లినపుడు క్లాస్ రూంలో ఆమెను కలిశాడు. తను చివరిసారిగా జమీలాను 4వ తరగతిలో ఉండగా చూసాడు. తనని గుర్తు చేస్తూ జమీలాను పలకరించాడు. దీంతో ఇద్దరు ఫోన్ నెంబర్స్ మార్చుకున్నారు. దీంతో మొహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ పుట్టినరోజుకి జమీలా ఫోన్లో శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ చేసింది. మొహమ్మద్ ఆమెపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆ విషయాన్ని ఆమెకు కూడా చెప్పేశాడు.
వారిద్దరి మధ్య ఉన్న 26ఏళ్ల వయసు బేధం కారణంగా జమీలా అతడిని తొలుత వద్దనుకుంది. అహ్మద్ అలీ ఆమె ఇంటి అడ్రస్ కనుక్కున్నాడు. రాకపోకలు సాగించాడు. నెమ్మిదిగా ఆమెతో కలిపాడు. దీంతో వారి మధ్య ప్రేమ పెరిగింది. చివరికి జమీలా మొహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ ప్రేమను అంగీకరించింది. 2019లోనే వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కోవిడ్ కారణంగా పెళ్లి వాయిదా పడింది. 2021లో మొత్తానికి ఈ జంట ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మధ్యలో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. జమీలాకి 2007లో మొదటి భర్తతో విడాకులయ్యాయి. ప్రస్తుతం అహ్మద్ అలీ వాటర్ ప్లాంట్ లో వర్క్ చేస్తున్నాడు. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే అని.. 26 సంవత్సరాల వయసు తేడా తమ ప్రేమకు అడ్డంకి మారలేదని ఈ జంటచెబుతుంది.