Mars: అంగారక గ్రహంపై వరి పంట..గుడ్ న్యూస్ చెప్పిన శాస్త్రవేత్తలు
అమెరికాలోని మొజావే ఎడారికి చెందిన శిలల పొడితో మార్స్ (Mars) మీద ఉండే మట్టిని శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. ఆ మట్టిని కుండీల్లో నింపి వాటిలో వడ్లు చల్లారు. రోజుకు రెండు సార్లు ఆ కుండీల్లో నీళ్లు పోయగా వరి గింజలు మొలకెత్తాయి. అడవి వంగడాన్ని కూడా పరీక్షించగా వడ్లు మొలకెత్తినట్లు పరిశోధకులు తెలిపారు.
మానవ మనుగడ కోసం శాస్త్రవేత్తలు(Scientists) పరిశోధనలు జరుపుతున్న సంగతి తెలిసిందే. భూమి(Earth)పైనే కాకుండా ఇతర గ్రహాల(Planets)పై మనుషులు జీవించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఇతర గ్రహాలపై జీవం ఉనికిని తెలుసుకునే క్రమంలో ప్రస్తుతం అంగారక గ్రహం(Mars)పై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపడుతున్నారు. ఎలాన్ మస్క్ (Elone Musk) కూడా దీని కోసం పరిశోధనలు చేస్తున్నట్లు గతంలో తెలిపారు. మార్స్ గ్రహంపై మనుషులతో కూడిన కాలనీలు ఏర్పాటు చేయాలన్నదే తన లక్ష్యమని మస్క్ ఇది వరకే వెల్లడించారు.
అంగారక గ్రహం (Mars)పైకి ఒక వేళ మనుషులను పంపితే వారు జీవించేందుకు తగిన ఆహారం కావాలి. వారికి కావాల్సిన పదార్థాలు భూమి నుంచి తీసుకెళ్లడం కుదరదు కాబట్టి అంగారకుడి మీదనే పంటలు పండించేందుకు శాస్త్రవేత్తలు(Scientists) సిద్ధమయ్యారు. అందుకోసం ముమ్మరంగా పరిశోధనలు చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ అర్కాన్సస్ అంగారక గ్రహంపై వరి పంట(Rice Corp) పండించేందుకు పరిశోధనలు చేపట్టింది. సైంటిస్ట్ అభిలాష్ రామచంద్రన్(Abhilasha Ramachandran) ఈ టీమ్ కు నాయకత్వం వహిస్తున్నాడు.
అమెరికాలోని మొజావే ఎడారికి చెందిన శిలల పొడితో మార్స్ (Mars) మీద ఉండే మట్టిని సిద్ధం చేశారు. ఆ మట్టిని కుండీల్లో నింపి వాటిలో వడ్లు చల్లారు. రోజుకు రెండు సార్లు ఆ కుండీళ్లో నీళ్లు పోయగా వరి గింజలు మొలకెత్తాయి. అడవి వంగడాన్ని కూడా పరీక్షించగా వడ్లు మొలకెత్తినట్లు పరిశోధకులు తెలిపారు. త్వరలోనే అంగారకుడి మీద చేపట్టే ప్రయోగాలకు ఈ పరిశోధన తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్త అభిలాష్ రామచంద్రన్ (Abhilasha Ramachandran) తెలిపారు.