Rajasthani Bride Receives Gifts:పెళ్లంటే ఒక్కడే హడావిడి.. పనులు కూడా పూర్తి కావు. కట్న, కానుకల సంగతి వేరే లెవల్. స్థాయిని బట్టి ఇస్తుంటారు. రాజస్థాన్లో (Rajasthan) అలాంటి పెళ్లి ఒకటి జరిగింది. ఆ యువతికి పేరంట్స్ కాదు.. మేనమామలు అదిరిపోయే కట్నం ఇచ్చారు. వారు ప్రేమతో ఇచ్చిన కట్న, కానుకలు చూసి.. పెళ్లికి వచ్చినవారే ఆశ్చర్యపోయారు.
మనం చెప్పుకున్న పెళ్లి నాగౌర్ జిల్లాలో జరిగింది. వధువుకు (bride) ముగ్గురు మేనమామలు ‘మేరా’ పేరుతో బహుమతులు (gifts) ఇస్తుంటారు. ఈమెకు మాత్రం దేశం మొత్తం గుర్తుండేలా కానుక ఇచ్చారు. రూ.3.21 కోట్ల (rs.3.21 crores) విలువ గల ఆభరణాలు, నగదు, భూమి, స్కూటీ ఇచ్చారు. పెళ్లికి వచ్చినవారు కూడా ఆశ్చర్యపోయారు. గిప్ట్ (gift) ఇచ్చే సందర్భాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
వధువు అనుష్కకు రూ.80 లక్షల నగదు (rs.80 lakh cash), ఆభరణాలు (jewellery), ఫ్లాట్ (flat), 41 తులాల బంగారం (gold), మూడు కేజీల వెండి (silver), 10 ఎకరాల భూమి (land) పేపర్, ట్రాక్టర్ (tractor), స్కూటీ (scooty) ఇచ్చేశారు. పెళ్లికి తాత భన్వర్ లాల్ గర్వ (bhanwarlal garva) వచ్చారు. అతని స్వగ్రామం బుర్దీ (burdi).. కాగా.. ముగ్గురు కుమారులు హరేంద్ర (harendra), రామేశ్వర్ (rameshwar), రాజేంద్ర (rajendra) ఉన్నారు.
అనుష్కకు (anushka) మేనమామలు కానుకలను అందజేశారు. తన సోదరులు అందజేసిన బహుమతులు చేసి అనుష్క (anushka) తల్లి గేవరీ దేవి ఆశ్చర్యపోయారు. గేవరి దేవి తమ కుటుంబానికి చాలా చేసిందని.. తన కుమారులు సంపాదించేందుకు ఆమె సాయం చేసిందని ఆమె తండ్రి భన్వర్ లాల్ గర్వ తెలిపారు. అందుకోసమే ఆమెకు తిరిగి ఆ సంపాదన ఇవ్వడం మర్యాద మాత్రమేనని వివరించారు.