»Rajasthan Man Rides Tractor Over Brother Many Times Locals Film Murder
Viral News: అన్న రాతి గుండె.. సొంత తమ్ముడిపై ట్రాక్టర్ ఎక్కించి.. హత్య
భూ వివాదం ఒకరి చావుకు కారణం అయింది. కిందపడిన తమ్ముడిపై ట్రాక్టర్ ఎక్కించి మరి హత్య చేశాడు. దీంతో సొంత తమ్ముడు మరణించగా.. మరొ ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.
Rajasthan man rides tractor over brother many times, locals film murder
Viral News: రక్త సంబంధం లేదు.. అన్నాతమ్ముళ్ల అనుబంధం లేదు. ఆస్తి కోసం చంపడానికి వెనకాడటం లేదు. రాజస్థాన్(Rajasthan) భరత్పూర్ జిల్లాలో ఇలాంటి ఘటన జరిగింది. భూ వివాదం కారణంగా ఒకరిపై పలుమార్లు ట్రాక్టర్ ఎక్కించి హత్య చేశాడు. మరణించి వ్యక్తి ఎవరో కాదు అతని సొంత తమ్ముడే. చుట్టూ ఉన్న వారు వీడియో తీస్తున్నారు తప్ప, అతన్ని ఆపడం లేదు. ఈ రాతి హృదయాన్ని చూసి నెటజన్లు తిడుతున్నారు.
నిర్పత్ గుర్జర్(30)పై అతని సోదరుడు దామోదర్ గుర్జర్ ట్రాక్టర్ ఎక్కించి హత్య చేశాడు. ఈ విషయాన్ని భరత్పూర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఓంప్రకాష్ కిలానియా తెలిపారు. మూడు రోజుల క్రితం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ రోజు మళ్లీ వారి మధ్య గొడవ జరిగిందని కిలానియా తెలిపారు. అడ్డా గ్రామంలో నిర్పత్, దామోదర్ ఉదయం గొడవ పడ్డారు. నిర్పత్ పై దామోదర్ ట్రాక్టర్‌తో హత్య చేశాడు. ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. వీరి మధ్య చాలా కాలంగా భూ వివాదం ఉందని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మిగతా నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని పోలీసులు ప్రకటించారు.