Viral Video: సాధారణంగా రోడ్డు మీద ఏ కొత్త వాహనం కనిపించిందంటే.. అందరూ దాని వైపు ఆశ్చర్యంగా చూస్తారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. పోస్ట్ చేసిన వెంటనే కొన్ని వీడియోలు వైరల్ అయితే మరికొన్ని వీడియోలు పోస్ట్ చేసిన చాలా రోజులకు వైరల్ అవుతాయి. అలాంటి వాటిలో సూరత్ మోనోసైకిల్ రైడింగ్ వీడియో ఒకటి. సోషల్ మీడియాలో జూలై 31న పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
సూరత్‌లో ఒక పెద్దాయన జోరుగా మోనోసైకిల్ నడుపుతున్నాడు. రోడ్డుపై ఈ వాహనం వెళ్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. ఈ వీడియోని చూసి నెటిజన్లు ఇన్ బ్లాక్ ఫ్రాంచైజీలో K, J ఉపయోగించే గైరో సైకిల్ వాహనాన్ని.. మోనోసైకిల్ గుర్తు తెచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు వర్షం వచ్చినప్పుడు బురద నీరంతా తలపైకి వెళ్తుందని, నిజ జీవితంలో మ్యాన్ ఇన్ బ్లాక్, మెన్ ఇన్ బ్లాక్ వైబ్, మ్యాన్ ఇన్ బ్లాక్ ఇండియన్ వెర్షన్ అని నెటిజన్లు ఒక్కో పేరుతో కామెంట్ల రూపంలో తెలిపారు.