న్యాచురల్ స్టార్ నాని.. ఈసారి మాస్ ఆడియెన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అసలు దసరా సినిమాలో నాని మేకోవర్ చూసినప్పుడే ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిపోయింది. ఇక టీజర్ చూసిన తర్వాత.. అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. నాని ఎలివేషన్ మరింత హైప్ క్రియేట్ చేసింది. ఆర్ఆర్ఆర్, కెజియఫ్, కాంతార లాగే దసరా ఉంటుదని చెబుతున్నాడు. దాంతో దసరా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు సినీ అభిమానులు. దసరా బిజినెస్ కూడా భారీగా జరిగింది. మార్చి 30న ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొత్త దర్శకుడే అయినా.. శ్రీకాంత్ ఓదెల మేకింగ్ అదిరిపోయిందని అంటున్నారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి.. ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాని కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇక హీరోయిన్ కీర్తి సురేష్.. నానిని మించి ఊరమాస్‌గా కనిపించబోతోంది. త్వరలోనే వెన్నెలకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయనున్నారు. ఇలా అన్నీ కూడా దసరా పై హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక రిలీజ్ టైం దగ్గర పడడంతో.. ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మేకర్స్. ఈ క్రమంలో నాని ట్విట్టర్, ఇన్‌స్టా ప్రొఫైల్ పిక్ కూడా మార్చేశాడు. దసరాలోని ధరణి మాస్ లుక్‌ను డీపిగా పెట్టుకున్నాడు. ఈ లుక్ అదిరిపోయేలా ఉంది. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. 36 రోజుల్లో దసరా థియేటర్లోకి రాబోతోంది.. ఎట్లైతే గట్లయే, చూసుకుందాం.. అని చెబుతున్నారు మేకర్స్. మొత్తంగా దసరా ప్రమోషన్స్ మాత్రం ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నట్టే కనిపిస్తోంది. మరి నాని ఊరమాస్‌గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.