»Nagaland Minister Shares Video Of Mans Drum Set Made With Household Items
Viral Video: ఇంట్లో వస్తువులతో మ్యూజిక్ డ్రమ్స్ ..మెచ్చుకున్న మంత్రి, నెటిజన్లు
కొంత మందికి ప్రతిభ ఉన్నా తగిన వనరులు లేవని ఏం చేయకుండా అలా కూర్చిండిపోతారు. కానీ ఈ వ్యక్తికి ఉన్న ట్యాలెంట్‌కు పేదరికం అడ్డం కాలేదు. అందుబాటులో ఉన్నవాటితో తన మెదడుకు పని చెప్పారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హీరో అయిపోయాడు. ఈ మేరకు నాగాలాండ్ మినిస్టర్ ఈ వీడియోను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
Nagaland minister shares video of man’s drum set made with household items
Viral Video: సోషల్ మీడియా(Social media) వచ్చిన తరువాత నూతన ప్రతిభావంతులు ఎందరో వస్తున్నారు. రాత్రికి రాత్రే స్టార్లుగా మారుతున్నారు. నిజానికి ఈ మాధ్యమాన్ని కరెక్ట్‌గా వాడుకుంటే ఒక ఉద్యమమే సృష్టించవచ్చు. కానీ కొంతమంది తప్పుగా వాడి ఈ మీడియాపై అపవాదు తెస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగలాండ్(Nagaland) టూరిజం, ఉన్నత విద్యాశాఖ మంత్రి టెంజెన్ ఇమ్న అలంగ్(Tenzen imna alang) మరో వీడియోను షేర్ చేశారు. అది ప్రస్తుతం వైరల్(Viral Video)గా మారింది. నిత్యం మన ఇంట్లో ఉపయోగించే సామాగ్రితో ఒక వ్యక్తి డ్రమ్స్ తయారు చేసి అద్భుతంగా వాయిస్తున్నారు. తన ట్యాలెంట్‌తో నాగాలాండ్ ప్రజలను అబ్బురపరుస్తున్న ఆ వ్యక్తి ప్రతిభను గుర్తించి మినిస్టర్ తన ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు.
ఉడెన్ షెల్స్(Wooden shells), ప్లాస్టిక్ డ్రమ్ హెడ్స్, మెటల్ హార్డ్‌వేర్‌తో తయారుచేసిన ఈ డ్రమ్(Drum) సెట్.. సదరు వ్యక్తి సృజనాత్మకత(Creativity) అద్భతంగా ఉందని, దీన్ని చూస్తుంటే అతనికున్న సంగీత పటిమకు అద్దం పడుతున్నదని నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఇక మంత్రి ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఇలాగే కష్టపడితూ పని చేస్తే ఏదోరోజు అదృష్టం కూడా నీ తలుపు తడుతుందని రాసుకొచ్చారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజనులు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్యాలెంట్‌కు సరైన అడ్డా సోషల్ మీడియా అని కామెంట్లు చేస్తుంటే.. అతని ప్రతిభకు పేదరికం అడ్డం కాలేదని మరికొందరు కామెంట్లు చేస్తూ అతన్ని మెచ్చుకుంటున్నారు.