»Mumbai Man Arrested Who Rides 7 Children With Scooty
Scootyపై ఏడుగురు చిన్నారులతో రైడ్, అరెస్ట్
ముంబైలో ఒకతను ఏడుగురు చిన్నారులతో కలిసి బైక్ మీద వెళ్లాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. ఆ బైకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూటీని సీజ్ చేశారు.
Mumbai Man Arrested Who Rides 7 Children With Scooty
Scooty: టూ వీలర్‌పై ఇద్దరు వెళ్లాలి. హైదరాబాద్‌లో (Hyderabad) అయితే వెనకాల ఉండేవారు విధిగా హెల్మెట్ ధరించాలి. ముగ్గురు, నలుగురు అంటే కష్టం.. కానీ ఓ ముంబైకర్ ఏకంగా ఏడుగురు చిన్నారులను ఎక్కించుకొని స్కూటీ డ్రైవ్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో (social media) పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ముంబై పోలీసులు స్పందించి.. సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.
ముంబైకి చెందిన మున్వర్ షా (munawar shah) కొబ్బరికాయల వ్యాపారం చేసుకుంటాడు. ఇటీవల పిల్లలతో స్కూటీ (scooty) మీద ప్రయాణం చేశాడు. ఏడుగురిని (seven people) ఎక్కించుకోవడం కాంట్రవర్సీకి దారితీసింది. ఇద్దరు పిల్లలు ముందు.. వెనకాల మరో ముగ్గురు కూర్చున్నారు. మరో ఇద్దరు వెహికిల్ (vehicle) క్రాష్ గార్డ్‌పై డేంజరస్‌గా నిలబడి ఉన్నారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది ఆ పోస్ట్ వైరల్ అయ్యింది.
పోలీసులు (police) మున్వర్ షాను అరెస్ట్ చేశారు. అతని స్కూటీని (scooty) సీజ్ కూడా చేశారు. సో.. వెహికిల్ ఇద్దరు వెళ్లండి.. అత్యవసరం అయితే ముగ్గురు వెళ్లొచ్చు. కానీ తగిన జాగ్రత్తలు కంపల్సరీ.. ఏకంగా ఏడుగురు వెళ్లడం.. వారంతా చిన్నారులే కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ స్కూటీ వెళ్లే సమయంలో ఏమీ కాలేదు. కింద పడిపోయిన ప్రమాదమే..? అందుకే పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Not the ride we support!
This rider had put the life of all pillion riders and others in danger.
— Mumbai Traffic Police (@MTPHereToHelp) June 25, 2023
మున్వర్ షా తీరును నెటిజన్లు ఏకీపారేశారు. అతను కనీసం హెల్మెట్ కూడా పెట్టుకోలేదని ఆక్షేపించారు. అతనే కాదు.. మిగతా వారి జీవితాలను ఫణంగా పెట్టారని అంటున్నారు. కేసు నమోదు చేయడమే కాదు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.