Etala Jamuna: మాజీమంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను చంపే కుట్ర జరుగుతోందని ఆయన భార్య ఈటల జమున (Etala Jamuna) సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ, హుజురాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి కుట్ర పన్నారని పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌ను చంపేందుకు రూ.20 కోట్లతో డీల్ మాట్లాడినట్టు తనకు తెలిసిందని వివరించారు. సీఎం కేసీఆర్ అడంతోనే కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ఈటల జమున (Etala Jamuna) చేసిన కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.
ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నామని.. జనానికి మంచి చేస్తున్నామని ఈటల జమున (Etala Jamuna) అన్నారు. ఎంత మందిని చంపిస్తారు అని అడిగారు. మీ బెదిరింపులకు భయపడబోమని ఈటల జమున (Etala Jamuna) తేల్చిచెప్పారు. కేసీఆర్ లాంటి వారిని చాలా మందిని చూశామని తెలిపారు. మీ అహంకారానికి జనం ఓటుతో బుద్దిచెబుతారని పేర్కొన్నారు. పదవుల కోసం ఈటల రాజేందర్ తలవంచరని తేల్చిచెప్పారు. ఆయన పార్టీ మారబోరని.. బీజేపీలోనే ఉంటారని ఈటల జమున స్పష్టంచేశారు. ఈటల పార్టీ మారతారనే ప్రచారంలో నిజం లేదని చెప్పారు. అలాగే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చిచెప్పారు.