»Mermaid Like Sea Creature Washes Ashore In Papua New Guinea Left Experts Shocked
Viral: సాగరతీరానికి కొట్టుకు వచ్చిన విచిత్ర జీవి.. ఏంటో తెలియక తికమకపడుతున్న జనం
మత్స్యకన్యల గురించి ఇప్పటి వరకు సినిమాలు, కథలలో మాత్రమే చూసి ఉంటారు.. విని ఉంటారు. అలాంటి జీవి నిజంగా ఈ ప్రపంచంలో ఉందా? దీనిని ధృవీకరించడానికి ఇంకా ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు
Viral: మత్స్యకన్యల గురించి ఇప్పటి వరకు సినిమాలు, కథలలో మాత్రమే చూసి ఉంటారు.. విని ఉంటారు. అలాంటి జీవి నిజంగా ఈ ప్రపంచంలో ఉందా? దీనిని ధృవీకరించడానికి ఇంకా ఎటువంటి ఆధారాలు కనుగొనబడలేదు. కానీ, పాపువా న్యూ గినియా నుండి వైరల్ అయిన చిత్రాన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అటువంటి మర్మమైన జీవి సముద్ర తీరానికి కొట్టుకు వచ్చింది. దీనిని ప్రజలు ‘మెర్మైడ్స్ గ్లోబ్స్టర్'(mermaid’s globster) అని పిలుస్తారు. ఈ మర్మమైన జీవి మృతదేహం సెప్టెంబర్ 20న పాపువా న్యూ గినియాలోని సింబ్రి ద్వీపం తీరంలో కనిపించింది. ఇది ఒక చిన్న అగ్నిపర్వత ద్వీపం. ఇక్కడ సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నారు. ఈ జీవిని చూసిన తర్వాత ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ జీవిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు బీచ్ వైపు పరుగులు తీశారు.
శాస్త్రవేత్తలు కూడా ఈ జీవిని చూసి ఆశ్చర్యపోతున్నారు. వారు కూడా అది ఏమిటో అర్థం చేసుకోలేకపోయారు. ఇది సముద్ర జంతువు కావచ్చునని నిపుణులు భావిస్తున్నారు. ప్రజలు ఈ రహస్య జీవి గురించి ఇంటర్నెట్లో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. కొందరు దీనిని సముద్రపు ఆవుగా అభివర్ణించగా, మరికొందరు దీనిని డాల్ఫిన్, షార్క్ అని అభివర్ణించారు. కానీ, జలకన్యగా భావించే వారి సంఖ్యే ఎక్కువ. ఇది గ్లోబస్టర్ అని నిపుణులు అంటున్నారు. సింబ్రి ద్వీపం ఒడ్డుకు కొట్టుకొచ్చిన సముద్ర జీవి శరీరం చాలా భాగం కుళ్లిపోయి గుర్తుపట్టలేనంతగా ఉంది. స్థానికులు మృతకళేయబరాన్ని పాతిపెట్టారు.