»Bizarre Incident Happened At Andhra Pradesh Palnadu
Oh My God: భార్య ప్రసవ వేదన.. అంతలోనే భర్త మృతి
నిండు గర్బిణీకి ప్రసూతి సేవలు కూడా అందించలేని పరిస్థితి పల్నాడు జిల్లా కారంపూడిలో ఉంది. గర్బిణీని 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి తీసుకొచ్చారు. సుఖప్రసవం జరిగింది. కానీ అంతలోనే విషాదం చోటు చేసుకుంది.
Bizarre Incident Happened At Andhra Pradesh Palnadu
Husband Died:ఆ వివాహిత నిండు గర్బిణీ.. పురిటి నొప్పులతో ప్రసవ వేదన పడుతోంది. రాత్రి సమయంలో.. 70 కిలోమీటర్లు పంపించారు. ఆస్పత్రి వద్దకు రాగానే గర్బిణీ డెలివరీ అయ్యింది. అంతలోనే విషాదం.. డబ్బులు తీసుకొస్తానని వెళ్లిన భర్త ప్రమాదం జరిగి చనిపోయాడు. మాటలకు అందని విషాదం ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ఇలాఖాలో ఈ ఘటన జరిగింది.
అభాగ్యురాలు రామాంజిని
పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామాంజిని ఆ అభాగ్యురాలు.. ఆమె గురించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం.. బిడ్డ పుట్టిన కొద్దిసేపటికే భర్తను కోల్పోయింది. బాలింత అయిన ఆమె పట్టెడు దు:ఖంతో ఉంది. రామాంజినినీ ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఓ వైపు పసిపాపను చూసి ఆనంద పడాలో.. లేదంటే భర్త లేడని తెలిసి ఏడవాలో తెలియని పరిస్థితిలో ఉంది. ఆ దేవుడు తమకు పసిపాపను ఇచ్చారనే ఆనందం లేకుండా పోయింది.
అంబులెన్స్‌లో తిప్పుతూ..
రామాంజినికి శుక్రవారం రాత్రి పురిటి నొప్పులు వచ్చాయి. రాత్రి 10 గంటల సమయంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేవని చెప్పడంతో గురజాల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. సరేలే అనుకొని బయల్దేరి.. రాత్రి 11 గంటలకు అక్కడికి చేరుకున్నారు. అయినప్పటికీ నో యూజ్.. ఇక్కడ కూడా ఫెసిలిటీస్ లేవని చెప్పారు. నరసారావుపేటకు తీసుకెళ్లాలని చెప్పడంతో ఏం చేయాలో తెలియలేదు. ఆ భగవంతుడి మీద భారం వేసి బయల్దేరారు.
బిడ్డ జననం
నరసరావుపేట ఆస్పత్రి వద్దకు రాగానే రామాంజిని బిడ్డకు జన్మనిచ్చింది. కారంపూడి నుంచి గురజాల వరకు తోడుగా వచ్చిన భర్త ఆనంద్.. డబ్బుల కోసం ఇంటికి వెళ్లాడు. మనీ తీసుకొని వస్తోండగా ఆ దేవుడు చిన్న చూపు చూశాడు. జోలకల్లు వద్ద పెద్ద గుంతలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. తీవ్ర గాయాలతో ఆనంద్ అక్కడ చనిపోయాడు. పుట్టిన బిడ్డను కూడా చూసే భాగ్యాన్ని ఆ దేవుడు కల్పించలేదు. ఆనంద్ ఇక లేడని తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు.
ఇక ఒంటరి జీవితం
డెలివరీ కూడా చేయలేకపోవడం.. 70 కిలోమీటర్లు తిప్పడంతో రామాంజిని జీవితాన్ని ఒంటరిని చేసింది. తోడుగా ఉండాల్సిన భర్తను దూరం చేసింది. కారంపూడి, గురజాల ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం వల్ల భర్తను కోల్పోయ్యింది. బాలింత అయిన రామాంజిని వేదన వర్ణణాతీతం. ఆమెకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రావొద్దు. ఇదే విషయాన్ని ఇరుగు పొరుగు వారు చర్చించుకుంటున్నారు.
70 కి.మీ తిప్పి
3 గంటలుగా.. 3 ఆస్పత్రుల చుట్టూ తిప్పి.. 70 కిలోమీటర్ల మేర తీసుకొచ్చారు. తీరా ఆస్పత్రికి రాగానే నార్మల్ డెలివరీ అయ్యింది. అదే కారంపూడిలో ఉంటే.. ఆమె భర్త కూడా పక్కనే ఉండేవాడు. ఆమె మాంగళ్యం నిలబడేది. ఇందుకు కారణం ఎవరూ..? పాలకులు కాదా.? తమపై ఎందుకీ నిర్లక్ష్యం అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.