»Peddireddys Anarchy Goes Unhindered Is It A Crime To Ride A Bicycle Under The Rule Of Psycho Lokesh Jagans Post Is Now Going Viral
Nara Lokesh:సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే!
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ నేతల దౌర్జన్యానికి అవధుల్లేవని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ విమర్శించారు. చంద్రబాబుకు నిరసనగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు చేపట్టిన సైకిల్ యాత్రలో టీడీపీ నేతలపై దౌర్జన్యం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Nara Lokesh: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు పలువురు టీడీపీ కార్యకర్తలు సైకిల్ యాత్ర చేపట్టారు. వైసీపీ ముఖ్యనాయకుడు, మంత్రి పెద్దిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఈ టీడీపీ కార్యకర్తలను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ సైకిల్ ర్యాలీలో టీడీపీ కార్యకర్తలపై పెద్దిరెడ్డి గ్యాంగ్ రెచ్చిపోయింది. వారిని అర్థనగ్నంగా నిలబెట్టి, బూతులు తిడుతూ, బెదిరింపులకు గురి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే! పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుండి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి… pic.twitter.com/MKLL0bcGdb
‘సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే! పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు తీసి దాడికి పాల్పడ్డాడు. బాబుతో నేను అంటూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అధికారం ఇచ్చింది టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించడానికి, జెండాలు పీకడానికా జగన్? వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డుపై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని’ లోకేశ్ ధ్వజమెత్తారు.