»Prime Minister Of Papua New Guinea Touches Pm Modis Feet
PM Modi: ప్రధాని కాళ్లు మొక్కిన ఆ దేశ ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నేడు పపువా న్యూ గినియా(Papua New Guinea) చేరుకున్నారు. ఈ ఐస్లాండ్(Island) పర్యటనకు వెళ్లిన భారత తొలి ప్రధాని ఆయనే.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) నేడు పపువా న్యూ గినియా(Papua New Guinea) చేరుకున్నారు. ఈ ఐస్లాండ్(Island) పర్యటనకు వెళ్లిన భారత తొలి ప్రధాని ఆయనే. విమానాశ్రయంలో దిగిన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపే(James Marape) భారత ప్రధాని మోదీ పాదాలను తాకారు. అనంతరం నేతలిద్దరూ కౌగిలించుకున్నారు. ప్రధాని మోదీ పాదాలను నమస్కరిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ వెళ్లి అక్కడ ఆయన జీ7 సదస్సులో పాల్గొన్నారు. అక్కడ ఆయన పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా నిర్వహించారు. దీని తర్వాత నేరుగా పపువా న్యూ గినియా చేరుకున్నారు. ఇక్కడ ఫోరమ్ ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్ (FIPIC) యొక్క మూడవ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ, పీఎం మారాపే పాల్గొంటారు.
మెరుగు పడనున్న దేశాల మధ్య సంబంధాలు
పపువా న్యూ గినియా చేరుకున్న తర్వాత, ప్రధానమంత్రి మారాపేకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రత్యేక క్షణాన్ని తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ప్రధాని అన్నారు. తన పర్యటన సందర్భంగా ఈ గొప్ప దేశంతో భారతదేశ సంబంధాలను మెరుగు పరచేందుకు ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు.
Reached Papua New Guinea. I am thankful to PM James Marape for coming to the airport and welcoming me. This is a very special gesture which I will always remember. I look forward to boosting India’s ties with this great nation during my visit. pic.twitter.com/9pBzWQ6ANT
భారత్ మాతా కీ జై నినాదాలు
ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు భారతీయులు కూడా చేరుకున్నారు. పాపువా న్యూ గినియా చేరుకున్న తర్వాత, భారతీయులు కూడా ప్రధానికి ఘనస్వాగతం పలికారు. ఆయనకు స్వాగతం పలుకుతూ భారతీయులు భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేయడం వీడియోలో చూడవచ్చు.
#WATCH | People from the Indian diaspora welcome Prime Minister Narendra Modi as he arrives in Papua New Guinea. pic.twitter.com/O2DfVjSRyd
FIPIC 2014లో ప్రారంభించబడింది
ఐస్లాండ్ దేశమైన పపువా న్యూ గినియాకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ సదస్సుకు చేరుకున్న మొత్తం 14 దేశాలకు ధన్యవాదాలు తెలిపారు. 2014లో ప్రధాని మోదీ ఫిజీ పర్యటన సందర్భంగా FIPIC ప్రారంభించబడింది. మొత్తం 14 ఐస్‌ల్యాండ్ దేశాలు మూడవ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనవచ్చు. కనెక్టివిటీ ఇతర విషయాల వల్ల అన్ని దేశాలు ఒకచోట చేరలేకపోయాయి.
ఈ ఐస్లాండ్ దేశాలు FIPICలో చేర్చబడ్డాయి
PICలలో కుక్ దీవులు, ఫిజీ(Fiji), కిరిబాటి, రిపబ్లిక్ ఆఫ్ ది మార్షల్ దీవులు, మైక్రోనేషియా, నౌరు, నియు, పలావు, పాపువా న్యూ గినియా, సమోవా, సోలమన్ దీవులు, టోంగా, తువాలు మరియు వనాటు ఉన్నాయి. తన పర్యటనలో, ప్రధాని మోదీ పాపువా న్యూ గినియా ప్రధాని మారాపేతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా పపువా న్యూగినియా గవర్నర్ జనరల్ బాబ్ డేడ్తోనూ ప్రధాని మోదీ భేటీ కానున్నారు.