»Kurkure Packet Dispute In Agra Uttar Pradesh A Woman Has Applied For Divorce
Viral News: కుర్కురే ప్యాకెట్ వివాదం.. విడాకులకు అప్లై చేసిన మహిళ
ఈరోజుల్లో ప్రతీ చిన్న విషయానికి భార్యభర్తలు తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సర్దుకుపోయే పరిస్థితులకు కూడా విడాకులు కావాలని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.
Kurkure packet dispute in Agra, Uttar Pradesh.. A woman has applied for divorce
Viral News: వివాహం.. సుఖ-దు:ఖల్లో ఇద్దు మనుషులు కలిసుండాలి అని పెద్దల సమక్షంలో, వేదమంత్రాలు, పంచభూతాల సాక్షిగా జరిపించే ఓ తంతు. దానికి కట్టుబడే కొన్ని సర్థుకుపోవాలి, కొన్నింటిని ఎదిరించాలి కానీ భాగస్వామిని ఎప్పటికి వీడరాదు అనేది పెద్దల కాన్సెప్ట్. కానీ నేటి పరిస్థితి దానికి భిన్నంగా మారింది. చిన్న కారణం అయినా గొడవ పెట్టుకోవడం, కాస్త గొడవకే విడాకులు అడగడం. తాజాగా ఓ కేసు పోలీసులను సైతం ఆశ్చర్యపరిచింది. కేవలం రూ. 5 కుర్కురే కోసం కోటు మెట్లు ఎక్కింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఏడాది క్రితమే ఓ జంట వివాహం జరిగింది. వారి మధ్య ఏ గొడవ లేదు అన్యోన్యంగానే ఉంటున్నారు. అయితే ఆమెకు రోజు కుర్కురే తినే అలావాటు ఉంది. పెళ్లైన తరువాత భార్య సరదా ఎందుకు కాదనాలని కొన్నాళ్లు క్రమం తప్పకుండా కుర్కురే ప్యాకెట్ తీసుకొచ్చాడు భర్త. ఆ తరువాత ఇది జంక్‌ఫుడ్, ఎక్కువ తినడం వలన ఆరోగ్యానికి ఏదైనా సమస్య ఉండొచ్చు అని వారించాడు. అయినా భార్య వినలేదు. తాను మానేస్తుంది కదా అని భర్త కొన్నాళ్లు అలా నెట్టుకొచ్చాడు. కొన్ని నెలలు అయిన తరువాత భర్త కుర్కురే ప్యాకెట్ తీసుకురాలేదు. ఆ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో భార్య పుట్టింటికి వెళ్లింది. కొన్నాళ్ల తరువాత భర్త కొట్టాడు.. అతనితో ప్రాణపాయం ఉంది.. అతని నుంచి విడాకులు ఇప్పించండి అని ఫిర్యాదు అయింది. ఈ విషయం తెలిసిన పోలీసులు విస్తు పోయారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వలని నిర్ణయించారు. అలాగే ఇటీవల పెళ్లై 18 నెలలు అవుతున్న తన భర్త ఒక్కసారి కూడా తిట్టలేదు, కొట్టలేదు అని విడాకులు కావాలని యూపీ మహిళ కోర్టుకెక్కిన సంఘటన చర్చనీయాంశం అయింది.