»In That State It Is Served Without Cooking No Oil No Boil
No oil No boil: అక్కడ వండకుండానే వడ్డిస్తారు!
ఆ రెస్టారెంట్ లో 2200 రకాల పదార్ధాలు వండకుండానే వడ్డీస్తారు. అంతేకాదు వాటన్నింటినీ నిప్పూ నూనే ఉపయోగించకుండా తయారు చేయడం విశేషం. ఆ ప్రాంతం ఎక్కడుందో ఇప్పుడు చుద్దాం.
కానీ ఆ పచ్చివాసనని భరిస్తూ ఎలా తినడం?’ ఇదే ప్రశ్న చాలా రోజులుగా శివనీ వేదిస్తుండేదట. ఆయన ఇదివరకు ఓ ప్రయివేటు సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తుండేవాడు. తమిళనాట(Tamil Nadu) ప్రకృతి వ్యవసాయం కోసం పోరాడిన నమ్మాళ్వార్ అన్న శాస్త్రవేత్త బోధనలపైన అతనికి మంచి గురి ఉండేదట. ఆయనోసారి ఓ విందుకెళితే అక్కడ నూనె, నిప్పూ వాడకుండా ఓ ఐదు రకలతో కూడిన భోజనం పెట్టారట. ఇదెలా చేయగలిగారని అడిగితే, తమిళనాడులోని కొన్ని ప్రకృతి వ్యవసాయ బృందాలు ఇలాంటి వంటకాలు తయారుచేస్తున్నట్లు చెప్పారట. ఆ బృందాల దగ్గరకి వెళ్ళి ఓ 15 వెరైటీలు నేర్చుకున్నాడు శివ. వాటిపైన పదేళ్ళపాటు ప్రయోగాలు చేస్తూ 2200 వంటకాలు తయారుచేశాడు. తమిళంలో నైవేద్యం అనే అర్థం వచ్చే ‘పడైయల్(Padayal)’ అన్న పేరుతో ఓ క్యాటరింగ్ అకాడమీని ఏర్పాటుచేశాడు.
ఒక్క తమిళనాడు మాత్రమే కాకుండా దక్షిణాదిలోని పలు రాష్ట్రాలు తిరుగుతూ క్యాటరింగ్ (Catering) విద్యార్థులకి దీన్ని నేర్పించసాగాడు. ఈ వెరైటీ తరగతులపైన మీడియా దృష్టి కూడా పడటంతో ‘250 మంది మహిళలతో మూడు నిమిషాల్లో 300 వంటకాలు’ చేయించి ప్రపంచ రికార్డు సాధించాడు. వాటిని సామాన్యులకీ చేరువచేయాలన్న లక్ష్యంతోనే తన స్వస్థలం కోయంబత్తూరు(Coimbatore)లో ‘నో ఆయిల్ నో బాయిల్’ రెస్టరంట్ (Boyle’ Restaurant) పెట్టి… మూడేళ్ళుగా విజయ వంతంగా నడుపుతున్నాడు. మనదేశంలో మూడుపూటలా ఇలాంటి ఆహారాన్ని వడ్డిస్తున్న రెస్టరంట్ ఇదొక్కటే మరి!