Mumbai Train:ట్రైన్ మిస్సయితే ఇంకోటి వస్తుంది.. ప్రాణం పోతే మళ్లొస్తదా !
ముంబైలో రైల్వే ప్రయాణం మరీ దారుణంగా తయారైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ముంబైకి చెందిన వారు కాని, లేదా వేరు వారు కూడా ఇందులో ప్రయాణించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు.
Mumbai Train: ముంబైని దేశ ఆర్థిక రాజధానిగా పేర్కొంటారు. జీవనోపాధి కోసం లక్షల మంది ప్రజలు నిత్యం ముంబై నగరాన్ని చేరుకుంటారు. దీంతో ఇప్పుడు నడవడానికి కూడా స్థలం లేని విధంగా ఈ నగరం పరిస్థితి తయారైంది. రోడ్డు అయినా, రైల్వే స్టేషన్ అయినా అన్ని చోట్లా ఎక్కడ చూసినా జనమే జనం. ముంబైలో రైల్వే ప్రయాణం మరీ దారుణంగా తయారైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తర్వాత ముంబైకి చెందిన వారు కాని, లేదా వేరు వారు కూడా ఇందులో ప్రయాణించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత, ముంబై లైఫ్ లైన్ ఇక్కడికి వచ్చే ప్రజల కలలను ఎలా మోసుకుపోతుందో మీకే అర్థమవుతుంది. ఈ వైరల్ వీడియోలో ఒక అమ్మాయి కిక్కిరిసిన రైల్లో ప్రయాణించాల్సి వచ్చింది. స్టేషన్ నుండి రైలు బయలు దేరింది. రైలు భోగీలో కనీసం నిల్చునేందుకు కూడా ప్లేస్ లేదు. దీంతో అమ్మాయి ప్రమాదమని తెలిసిన మెట్లపై వేలాడుతూ కనిపించడం వీడియోలో చూడవచ్చు.
1986
I used to travel like this on mumbai local
From Ghatkopar to Dadar
Putting life on the line
Things haven’t changed much pic.twitter.com/0rG1YKoicD
అమ్మాయి సగం కాలు రైలు నిచ్చెనపై ఉంటే, మిగిలిన సగం కాలు బయట ఉంది. నిజంగా చెప్పాలంటే ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కాస్త అటు ఇటు అయినా విద్యుత్ స్తంభాలను ఢీకొట్టే వీలుంది. ఈ వీడియోను @mjavinod అనే ఖాతా ద్వారా ట్విట్టర్లో షేర్ చేశారు. వేలాది మంది చూసి, ఇష్టపడ్డారు. వీడియో క్యాప్షన్‌లో, ‘1986 సంవత్సరంలో, ముంబై స్థానికుల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది.. నిజంగా ఏమీ మారలేదు’ అని రాశారు.