Biryani Order : బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అకేషన్ ఏదైనా తినడానికి బిర్యానీ ఉండాల్సిందే. తాజాగా ముంబైకి చెందిన ఓ యువతి మద్యం మత్తులో బెంగళూరు నుంచి బిర్యాని ఆర్డర్ చేసింది. బెంగళూరులోని మేఘన ఫుడ్స్ నుంచి రూ.2500 ధర గల బిర్యానీని ఆర్డర్ చేసింది. ఆ రెస్టారెంట్ కూడా ఆ ఆర్డర్ ను యాక్సెప్ట్ చేయడంతో బిర్యానీ కోసం వెయిట్ చేస్తూ ఉంది. మత్తులో తను బెంగళూరులో ఉన్న రెస్టారెంట్ లో బిర్యానీ బుక్ చేసినట్టు తనకు మత్తు దిగాక కానీ తెలియలేదు.
మత్తు దిగాక ట్విట్టర్ లో తను మద్యం మత్తులో ఏం చేశానో చెప్పుకొచ్చింది. నేను అంతగా తాగానా? మద్యం మత్తులో నేను రూ.2500 విలువైన బిర్యానీని బెంగళూరు నుంచి ముంబైకి ఆర్డర్ చేశా.. అంటూ ఆర్డర్ చేసిన బిల్ స్క్రీన్ షాట్ ను కూడా షేర్ చేసింది. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు అది జొమాటో వరకు వెళ్లింది. ఆర్డర్ మీ ఇంటి ముందుకు చేరుకున్నాక మీ హ్యాంగ్ ఓవర్ తగ్గుతుంది. బిర్యానీ తిన్నాక మీ అనుభవాన్ని మాతో పంచుకోండి అంటూ జొమాటో ఆ పోస్ట్ పై కామెంట్ చేసింది.
Biryani Order : బెంగళూరు నుంచి ముంబైలోని తన ఇంటికి చేరుకున్న బిర్యానీ
జొమాటో ఇటీవలే జొమాటో లెజండ్స్ పేరుతో ఇంటర్ సిటీ డెలివరీ సర్వీస్ ను ప్రారంభించింది. అంటే.. ఒక సిటీలో ఉండి మరో సిటీకి చెందిన ఫుడ్ ను ఆర్డర్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ ఫుడ్ డెలివరీ అవడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. తాజాగా ఈ యువతి విషయంలోనూ అదే జరిగింది. తెల్లారి ఆ యువతికి బెంగళూరు నుంచి జొమాటో బిర్యానీని పంపించింది. బిర్యానీ తన ఇంటికి చేరుకున్నాక బిర్యానీ ఫోటోలు తీసి ఆ యువతి మళ్లీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.