»Dominos Staff Delivered Pizza To Customers Stuck In Bengaluru Traffic The Video Went Viral
Bengaluru traffic: ట్రాఫిక్‌లో కస్టమర్లకు పిజ్జా డెలివరీ చేసి ఆకలి తీర్చిన సిబ్బంది
బెంగళూరులో ట్రాఫిక్ జామ్ అయితే చాలా సమయం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆకలి అయితే ఏం చేస్తాం. మాములుగా అయితే ట్రాఫిక్ క్లియర్ అయిన తరువాత హోటల్ లేదా ఇంటికి వెళ్లి తింటాం. కానీ ఓ వ్యక్తి అక్కడి ట్రాఫిక్ పరిస్థితిని అర్థం చేసుకుని కారులో ఉండగానే పిజ్జాను ఆర్డర్ చేశాడు. వారు టైంకు రావడంతో కస్టమర్ ఆనందం వ్యక్తం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Domino's staff delivered pizza to customers stuck in Bengaluru traffic. The video went viral
Bengaluru traffic: హైదరాబాద్(Hyderabad)లో ట్రాఫిక్ అయితేనే మనం పది నిమిషాలు ఆగలేము. ముందున్న వాహనాలకు ఒకటే హారన్ కొడుతాము. కానీ బెంగళూరు(Bengaluru)లో ఒక్క సారి రోడ్లమీద వాహనాలు స్ట్రక్ అయితే ఇక అంతే సంగతులు. అది క్లియర్ అవడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. అయితే తాజాగా బెంగళూరులో బుధవారం సాయంత్రం ట్రాఫిక్ జామ్( traffic) ఏర్పడింది. ఈవినింగ్ అవడంతో ఆఫీసుల నుంచి వచ్చే వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. సహజంగానే వారు అలిసిపోయి, ఆకలితో ఇంటికి వెళ్తుంటారు. కాబట్టి ఆసహనంతో ఉంటారు. ఎలాగో రోడ్లపై వాహనాలు గంటల తరబడి నిలిచిపోతాయని వారికి తెలుసు. ఆ ట్రాఫిక్‌లో ఓ వినుత్న సంఘటన చోటుచేసుకుంది. అంత ట్రాఫిక్ ఉన్నప్పటికీ డామినోస్ డెలివరీ సిబ్బంది కస్టమర్‌కు పిజ్జా అందించారు. ట్రాఫిక్ లో ఉన్న కస్టమర్ ను వెతుక్కుంటూ వెళ్లి వారి ఆకలిని తీర్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ద్వారా డెలివరీ బాయ్ తమను వెతుక్కుంటూ వచ్చి పిజ్జా(pizza)ను అందించినట్లు ఆ కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అసలే బెంగళూరు అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే పరిస్థితి ఏంటో అక్కడి ప్రజలకు చాలా బాగా తెలుసు. అందుకే ఓ కస్టమర్ ఆకలి వేయడంతో లైవ్ లోకేషన్ ట్రాకింగ్‌ను వాడుకుని పిజ్జాను ఆర్డర్ పెట్టకున్నాడు. డొమినోస్ వారికి ఫోన్ చేసి ముందే వారి పరిస్థితి చెప్పడంతో, అర్థం చేసుకున్న సిబ్బంది పిజ్జాను పంపిస్తామని అన్నారట. దాంతో అతన్ని ట్రాక్ చేసుకుంటు వచ్చి సమయానికి డెలివరీ ఇచ్చారు బాయ్స్. ఈ వీడియో చూసిన నెటిజన్లు డామినోస్ డెలివరీ సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మరోవైపు కొందరు బెంగళూర్ ట్రాఫిక్‌పై జోకులు వేస్తున్నారు. ఈ సారి ఇంటి నుంచే క్యారియర్లు తీసుకువెళ్లాలని కొందరంటుంటే మరి కొందరు గ్యాస్‌తో పాటు ఇతర కిచెన్ సామాగ్రి కూడా తీసుకెళ్లాలేమో అని కామెంట్లు చేస్తున్నారు.