Domino’s: డబ్బులు ఉంటే చాలు.. ఫుడ్ విషయంలో ఏదైనా చేయొచ్చు.. ఇంట్లోనే కూర్చొని ఆర్డర్ చేయొచ్చు. డెలివరీ బాయ్ వచ్చి ఫుడ్ ఇస్తుంటారు. ఇవన్నీ మన మెట్రో సిటీల్లో చూశాం. మరీ పుడ్ గాలిలో ఎగురుతూ వచ్చి ఇవ్వడం చూశారా..? లేదు.. డోమినోస్ (Domino’s) కొత్త ప్రయత్నం చేసింది. తమ కస్టమర్లకు వినూత్న అనుభూతి కలిగించేందుకు ఇలా ట్రై చేసింది.
బ్రిటన్‌లో జెట్ప్యాక్ డెలివరీని డోమినోస్ (Domino’s) ప్రారంభించింది. గ్లాస్టన్ బరీ ఫెస్టివల్ సందర్భంగా దీనిని పరిచయం చేసింది. డెలివరీ ఏజెంట్లు గాలిలో ఎగురుతూ వచ్చి డోమినోస్ (Domino’s) ఆర్డర్లను కస్టమర్లకు అందజేశారు. జెట్ ప్యాక్ వేసుకొని అవేంజర్ మాదిరిగా ఉన్న వ్యక్తి పిజ్జా స్టోరేజ్ బాక్స్‌కు భుజాన తగలించుకొని గాలిలో ఎగురుతూ వచ్చాడు. కొండపై, గుడారాల్లో కూర్చొన్న వారికి పిజ్జా అందించారు. దీంతో వారు ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోను డోమినోస్ (Domino’s) యూకే ఇన్ స్ట్రాగ్రామ్లో షేర్ చేసింది.
ఈ సారి రాకెట్ మ్యాన్ జెట్ ప్యాక్ డెలివరీని ఎవరు చూశారు అని క్యాప్షన్ పెట్టింది. మీకు ఓ స్లైస్ కావాలా అని ప్రముఖ సింగర్ ఎల్టన్ జాన్‌కు ట్యాగ్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇది నిజమా అని కొందరు సందేహా పడ్డారు. అద్భుతంగా ఉందని మరికొందరు.. ఇకపై మరింత ఆసక్తికరంగా ఉంటుందని ఇంకొందరు అంటున్నారు. కొత్త డెలివరీని పరీక్షించడంలో భాగంగా డోమినోస్ పరీక్షించిందని మిర్రర్ కథనంలో పేర్కొంది.