Continued concerns in France.. President dancing with his wife.. Netizens are outraged
France:పోలీసుల కాల్పుల్లో ఫ్రాన్స్ కు చెందిన 17 ఏళ్ల యువకుడు మృతి చెందడంతో ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసన సెగలు రగులుతున్నాయి. మంగళవారం నుంచి వరుసగా ఆ దేశ పౌరులు అనేక విధ్యంసాలకు పాల్పపడుతున్నారు. ఈ ఆందోళనలను అరికట్టెందుకు ఫ్రాన్స్(France) ప్రభుత్వం పెద్ద ఎత్తున బలగాలను దింపింది. దాదాపు 45 వేల మంది పోలీసు బలగాలను మోహరింపజేసింది. ఈ ఆందోళనలో పాల్గోన్న యువకులను కట్టడిచేస్తోంది. ఇప్పటికే 1,100 మందిని అరెస్ట్ చేసినట్లు ఫ్రాన్స్ ఇంటీరియర్ మినిస్టర్ గెరాల్డ్ డార్మానిన్ తెలిపారు. దేశ అధ్యక్షడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్(Emmanuel Macron) సైతం పౌరులను కాస్త సంయమనం పాటించవల్సిందిగా కొరినప్పటికీ పరిస్థితులు ఇంకా ఆందోళనగా మారుతున్నాాయి.
ఈ దుర్ఘటన కారణంగా విమర్షలు ఎదుర్కొంటున్న అధ్యక్షుడు తాజాగా మరో వివాదం మూటగట్టుకున్నారు. దేశం మొత్తం ఇలా ఆందోళనలతో అతిలాకుతిలం అవుతుంటే మేక్రాన్(Emmanuel Macron) తన కుటుంబంతో కలిసి ఓ మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గోన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో, ఫ్రాన్స్ పౌరులు ఒక్క సారిగా భగ్గుమంటున్నారు. అధ్యక్షకుడిపై తీవ్ర స్థాయిలో విమర్షలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. ప్రముఖ బ్రిటిష్ సింగర్ ఎల్డాన్ జాన్(Eldon John) ఇటివలే పారిస్ లో ఓ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఈ షోకు అధ్యక్షుడు మేక్రాన్ తన సతీమణితో పాటు హాజరయ్యారు. ఆ షోలో తన భార్యతో కలిసి ఉత్సాహంతో చిన్న డ్యాన్స్ మూమెంట్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
నిజానికి ఈ పారిస్ లో ఎల్డాన్ జాన్ షో బుధవారం రాత్రి జరిగింది. అప్పటికీ ఫ్రాన్స్ లో ఆందోళనలు తీవ్ర స్థాయిలో లేవు. యువకుడు కాల్పుపులకు గురి అయింది మంగళవారమే అయినా గురువారం నుంచి ఆ ఘటనపై పెద్ద ఎత్తున్న ఆందోళనలు జరిగాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు మేక్రాన్ కూడా శుక్రావారం స్పందించారు. ఫ్రాన్స్ లో శాంతికోసం యువకులు ఇల్లు వదిలి రావద్దని, వారిని ఇంటిపట్టున ఉంచే బాధ్యత తల్లిదండ్రులదే అని విజ్ఙప్తి చేశారు.