France: ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్‌లో చదువుకునేందుకు చర్యలు తీసుకుంటారని వెల్లడించారు. 2030 నాటికి దాదాపు 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించి, ఇది ట్విటర్లో పోస్ట్ చేయబడింది. తన పర్యటన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాక్రాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఫ్రెంచ్ ఫర్ ఆల్, ఫ్రెంచ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్’ అనే చొరవతో యూనివర్సిటీల్లో ఫ్రెంచ్ నేర్చుకునేందుకు నెట్ వర్క్ రూపొందిస్తామని వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని విద్యార్థులకు అంతర్జాతీయ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఫ్రాన్స్ లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సౌకర్యం కల్పిస్తామని ఈ సందర్భంగా మాక్రాన్ వెల్లడించారు. 2025 నాటికి 20 వేల మంది విద్యార్థులను ఫ్రాన్స్‌కు తీసుకెళ్లాలన్నది లక్ష్యం.