»The Father Of Green Revolution Ms Swaminathan Is No More
MS Swaminathan: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఇకలేరు
భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా పేరుగాంచిన ఎంఎస్ స్వామినాథన్(98) గురువారం కన్నుమూశారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు.
Files missing in former minister Talasanis OSD Kalyan office masab tank
భారతదేశాన్ని వ్యవసాయ స్వావలంబన దిశగా నడిపించిన మేధావి ఎంఎస్ స్వామినాథన్ (98)(ms swaminathan) ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న స్వామినాథన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత చెందారు. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో ఆగస్టు 7, 1925న ఎంఎస్ స్వామినాథన్ జన్మించారు. ఆ తర్వాత బోర్లాగ్ పరిశోధనలను కొనసాగిస్తూ మన వాతావరణానికి అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అభివృద్ధి చేసి విజయం సాధించారు. దీంతోపాటు శాశ్వత ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం కోసం హరిత విప్లవం, సతత హరిత విప్లవం అమలు చేయాలని ఆయన చేసిన సిఫార్సులు మంచి ఫలితాలను అందించాయి.
అతని ప్రయత్నాలే ఆగ్నేయాసియాలోని చాలా దేశాలను ఆకలి నుంచి రక్షించాయి. 1952లో స్వామినాథన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి జన్యు శాస్త్రంలో పిహెచ్డి పొందారు. వ్యవసాయ రంగాన్ని అగ్రగామిగా మార్చడడానికి భారతదేశానికి వచ్చారు. ఆ క్రమంలో స్వామినాథన్ అధిక దిగుబడినిచ్చే విత్తనాలను అభివృద్ధి చేయడం, వాటిని రైతులకు వ్యాప్తి చేయడంలో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1966లో భారతీయ పరిస్థితులకు అనుకూలంగా ఉండే గోధుమ రకాలను అభివృద్ధి చేశారు. దీంతోపాటు పంజాబ్‌లోని వరిలో వంద రకాల పంటలు పండించారు.
ఈ క్రమంలో స్వామినాథన్ 1972లో అతను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) డైరెక్టర్ జనరల్‌గా, ఆ తర్వాత భారత ప్రభుత్వ కార్యదర్శిగా నియమించబడ్డాడు. 1979లో అతను యూనియన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించబడ్డాడు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ జనరల్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ప్రెసిడెంట్, నేషనల్ ఫార్మర్స్ కమీషన్ చైర్మన్ వంటి అనేక పదవుల్లో ఆయన తన ప్రతిభను నిరూపించుకున్నారు. స్వామినాథన్ కు ముగ్గురు కుమార్తెలు సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా రావు. ఆయన సతీమణి మీనా స్వామినాథన్.