KDP: సిద్ధవటం(M), చలమారెడ్డి కొట్టాలకు చెందిన గోపాలయ్య (75)పై మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ వనేశ్వరం వంక వద్ద ఎలుగుబంటి దాడి చేసింది. ఎలుగుబంటి దాడి నుంచి తప్పించుకొని గ్రామానికి వచ్చాడు. ఈ దాడిలో గోపాలయ్యకు కన్ను, చెవి, దవడ వద్ద తీవ్ర గాయాలయ్యాయి. గోపాలయ్యను స్థానికులు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.