PLD: రాజుపాలెంలో బుధవారం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పర్యటించారు. సహజ సిద్ధంగా సాగు చేస్తున్న చామంతి, మిర్చి, బొప్పాయి తోటలను పరిశీలించారు. మిర్చి పంటలో కలెక్టర్ కూలీలతో కలిసి కలుపు తీసి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి విధానంలో పండిన కూరగాయలను పరిశీలించి రైతులకు సలహాలు ఇచ్చారు.