NRPT: మద్దూరు పట్టణ కేంద్రంలో కొత్తగా నియమితులైన లైసెన్స్ సర్వేయర్లకు బేసిక్ జీతంతో పాటు, గౌరవ వేతనాన్ని పెంచాలని మంగళవారం జిల్లా మెజిస్ట్రేట్‌కు వినతిపత్రం ఇచ్చారు. ప్రతినెల తప్పనిసరిగా వేతనం ఖాతాలో జమ కావాలన్నారు. పెట్రోల్, రోజువారీ ఖర్చులకు నెల జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని సర్వేయర్లు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు.