Indian shooter who won another gold in asian games 2023 points table 5th in bharat
చైనాలోని హాంగ్జౌలో గురువారం జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ అదరగొట్టి స్వర్ణం కైవసం చేసుకుంది. భారత షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా, శివ నర్వాల్ కలిసి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. మహిళల 60 కేజీల స్వర్ణ పతక పోరులో నౌరెమ్ రోషిబినా దేవి.. చైనాకు చెందిన వు జియావోయి చేతిలో ఓడిపోయి రజతం గెల్చుకుంది. దీంతో భారత్ మొత్తం 24 పతకాలను గెల్చుకుని పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. వీటిలో ఆరు స్వర్ణాలు, 8 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. ఇక చైనా 145 పతకాలతో అగ్రస్థానంలో ఉంది.
ఈ క్రమంలో హాంగ్జౌలో మరో మూడు రోజుల షూటింగ్ ఈవెంట్లు మిగిలి ఉండగానే ఆసియా గేమ్స్‌లో భారత్ నాలుగు బంగారు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలతో షూటింగ్లో తమ అత్యుత్తమ ప్రదర్శనను సాధించింది. ఆసియా క్రీడలు 2023 షూటింగ్ ఈవెంట్లు అక్టోబర్ 1వరకు జరుగుతాయి. ఈ క్రమంలో రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ విభాగాల్లో మొత్తం 33 పతకాలు సాధించేందుకు భారత్ కు అవకాశం ఉంది.