ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ ఘోరంగా ఓటమిపాలైంది. క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమిండియా మూడో వన్డేలో ఓడింది. రాజ్ కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మూడో వన్డేలో 66 పరుగుల తేడాతో భారత్ ఓడినప్పటికీ సిరీస్ను మాత్రం కైవశం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 353 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఆ స్కోరును చేరుకోలేకపోయింది.
టీమిండియా 49.4 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 81 అత్యధిక పరులు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 56 పరుగులు చేసి అర్థశతకంతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్ 48, జడేజా 35 పరుగులు చేశారు.
ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లెన్ మ్యాక్స్ వెల్ 4 వికెట్లు పడగొట్టాడు. హేజిల్ వుడ్ 2, మిచెల్ స్టార్క్, సంగా, పాట్ కమిన్స్, గ్రీన్ తలొక వికెట్ తీసుకున్నారు. మ్యాచ్ ఓడినప్పటికీ మొదటి రెండు వన్డేల్లో గెలిన భారత్ 2-1తో వన్డే సిరీస్ను సొంతం చేసుకుంది.