చైనాలో జరుగుతున్న ఆసియా గేమ్స్‌లో భారత ఆటగాళ్లు పతకాల వర్షం కురిపిస్తున్నారు. ఈ గేమ్స్‌లో తెలంగాణ బిడ్డ మెరిసింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో ఈషా సింగ్ టీమ్ స్వర్ణ పతకం సాధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
ఈషా సింగ్ టీమ్ షూటింగ్ గేమ్స్‌లో 1759 పాయింట్లతో భారత్‌కు గోల్డ్ మెడల్ సాధించడం నిజంగా గొప్పవిషయమన్నారు. ఆమె టీమ్ స్పిరిట్‌ను చాటిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి అమలు చేస్తున్న పటిష్ట కార్యాచరణే జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికల్లో తెలంగాణ బిడ్డలు రాణించడానికి కారణమవుతోందన్నారు. తెలంగాణ క్రీడాకారులు రాబోవు రోజుల్లో మరెన్నో పతకాలను సాధించి, తెలంగాణ ఖ్యాతిని జగద్వితం చేయాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.