»Do You Know The Salary Of Nita Ambanis Makeup Artist
Nita Ambani : నీతా అంబానీ మేకప్ ఆర్టిస్ట్ జీతం ఎంతో తెలుసా..?
ఐదు పదుల వయసులో కూడా సెలబ్రిటీలు చెక్కు చెదరని అందంతో.. చెక్కిన పాలరాతి శిల్పంలా మెరిసిపోతూ.. యువతులకు ధీటుగా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తారు. మరి వీరిని ఇంత అందంగా చూపించేది ఎవరు అంటే మేకప్ ఆర్టిస్ట్‌లు. తాజాగా నీతా అంబానీ (Nita Ambani) మేకప్ ఆర్టిస్ట్ శాలరీ గురించి నెట్టింట వైరల్‌గా మారింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్, ముకేశ్ అంబానీ (Mukesh Ambani) భార్య నీతా అంబానీ (Nita Ambani).. భారత్‌లోని మోస్ట్ స్టైలిష్ వ్యాపారవేత్తల్లో ఒకరు. ఈమె అంబానీకి చెందిన ఐపీఎల్ ఫ్రాంఛైజీ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) టీం బాధ్యతలు చూస్తుంటారు. ఇంకా దాతృత్వంలోనూ చాలా ముందుంటారు. ఆమెకు సాంప్రదాయ భరతనాట్యంలోనూ ప్రావీణ్యం ఉంది. ఇక వీరికి ముగ్గురు పిల్లలు. అయితే ప్రస్తుతం నీతా అంబానీ వయసు 59. ఈ ఏజ్‌లోనూ ఆమె చాలా అందంగా కనిపిస్తుంటారు. మిక్కీ కాంట్రాక్టర్ (Mickey Contractor). ఈయన సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్. నీతా Ambani సహా ఆమె కూతురు (Isha Ambani), కోడలు శ్లోకా అంబానీ కూడా కాంట్రాక్టర్ దగ్గర మేకప్ (Makeup) చేయించుకుంటుంటారు.
ఇక మిక్కీ కాంట్రాక్టర్ విషయానికి వస్తే ఈయన చాలా మంది సెలబ్రిటీలకు మేకప్ చేస్తుంటారు. దేశంలోనే అత్యంత ఖరీదైన మేకప్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన మిక్కీ ఒక్కో ఈవెంట్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 75 వేల నుండి లక్ష రూపాయలు తీసుకుంటారట. బాలీవుడ్ (Bollywood) ప్రముఖ తారలు కరీనా కపూర్, దీపికా పదుకొణె, ఐశ్వర్యా రాయ్, అనుష్క శర్మ, శిల్పా శెట్టి, సోనాలి బింద్రె(Sonali Bindre) సహా ఎందరికో మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు నీతా అంబానీ సహా ఆమె కుటుంబంలోని ప్రముఖులకు మేకప్ చేస్తున్నారు. అయితే ఇది కాసేపు పక్కనబెడితే.. ఆయన మేకప్ చేసినందుకు ఎంత ఛార్జీ చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ జీతం గురించి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సామాన్యులు, మధ్య తరగతి వారు మిక్కీ (Mickey) కాంట్రాక్టర్ సేవలు పొందలేరు. ముంబైలో ఆయన దగ్గర మేకప్ చేయించుకోవాలంటే రోజుకు ఒక్క వ్యక్తికి రూ.75 వేల నుంచి లక్ష ఆపైన వసూలు చేస్తాడు. టాప్ సెలబ్రిటీలు అయితే ఈ ధర మరి కాస్త ఎక్కువే ఉంటుంది. రోజుకు లక్షల్లో సంపాదించే మిక్కీ నెల జీతం.. టాప్ కంపెనీల సీఈవోలకు మించి ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ముంబైలో టాప్ మేకప్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న మిక్కీ.. ఒకప్పుడు టోక్యో బ్యూటీ పార్లర్(Beauty parlour)లో హెయిర్‌డ్రెస్సర్‌గా పనిచేసేవాడు. సరైన పని, వేతనం దొరక్క ఇబ్బంది పడుతున్న రోజుల్లో.. నటి హెలెన్ మిక్కీని సినిమాల్లో పనిచేయమని ఆహ్వానించారట.