Ponnala Laksmayya : జనగామ కాంగ్రెస్‌లో మరోసారి రచ్చరచ్చ..
పొన్నాల లక్ష్మయ్య, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి (Kommuri Pratap Reddy) మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. గతంలో విమర్శలకే పరిమితమైన భేదాభిప్రాయాలు సస్పెన్షన్ ప్రకటనల వరకు వచ్చాయి.
జనగామ కాంగ్రెస్ (Janagama Congress) లో వర్గ విబేధాలు మరోసారి బహిర్గతమైంది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పీపుల్స్‌మార్చ్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి (Kommuri Pratap Reddy) వర్గాల వారు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగారు. తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం వద్దకు పాదయాత్ర చేరుకోగానే పొన్నాల, కొమ్మూరి వర్గాలు భట్టి విక్రమార్కకు స్వాగతం పలికేందుకు పోటీపడ్డాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో పొన్నాల (Ponnala) కొమ్మూరి మద్దతుదారులు తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేసుకున్నారు. పరిస్థితి చేయిదాటకముందే పోలీసులు (police) రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. భట్టి కాలు మోపక ముందే రెండు వర్గాల నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, క్రమశిక్షణ ఉల్లంఘనపై ఫైవ్‌మెన్ కమిటీ (Five-man committee) నివేదిక ఆధారంగా మాజీ ఎమ్మెల్యే కొమ్మూరిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జనగామ డీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్(DCC Working President) లింగాజీ గురువారం లేఖ విడుదల చేశారు. ఆ తర్వాత గంటలోనే కొమ్మూరి వర్గీయులైన కొందరు సీనియర్ నాయకులు సమావేశమై పార్టీని భ్రష్ఠుపట్టిస్తున్న పొన్నాలను తామే కాంగ్రెస్(Congress) నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కొమ్మూరి వర్గీయులు సీఎం కేసీఆర్‌కు పొన్నాల కోవర్టుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. మతిభ్రమించిన పొన్నాల ఎర్రగడ్డలో చేరి చికిత్స చేయించుకొని రావాలన్న ప్రకటనతో జనగామ కాంగ్రెస్‌లో అగ్గి రాజుకుంది..ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు పరస్పర ఆరోపణలకు దిగడం పార్టీలో రచ్చరచ్చ అవుతుంది. ఏఐసీసీ (AICC) అధ్యక్షుడి ఎన్నిక ఓటింగ్ వేళ గాంధీభవన్ సాక్షిగా నియోజకవర్గ ముఖ్యనేతలిద్దరి మధ్య విభేధాలు పొడచూపగా ఏకంగా ఎవరికివారే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని ప్రకటనలు చేయడం వైరల్ అవుతున్నది.