My daughter made her husband Prime Minister: Rishi Sunak's mother-in-law
Akshata Murthy sunak:ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి (Narayana Murthy) సతీమణీ సుధామూర్తి (Sudha Murthy) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తాను భర్తను పెద్ద వ్యాపార వేత్తను చేస్తే.. తన కూతురు ఏకంగా ప్రధానమంత్రిని (Prime minister) చేసిందని చెప్పారు. తన కూతురు వల్లే రిషి (Rishi) బ్రిటన్ ప్రధాని పదవీని చేపట్టగలిగారని పేర్కొన్నారు. చిన్న వయస్సులోనే బ్రిటన్ ప్రధాని పదవీ చేపట్టడం మాములు విషయం కాదని.. దాని వెనక తన కూతురు అక్షత మూర్తి సునక్ (Akshata Murthy sunak) ఉన్నారని తెలిపారు.
భార్య తలచుకుంటే భర్తను ఉన్నత శిఖరాలకు చేర్చగలదని సుధామూర్తి (sudha murthy) అంటున్నారు. తన కూతురు అల్లుడిని చాలా విషయాల్లో ప్రభావితం చేసిందని సుధామూర్తి (sudha murthy) చెబుతున్నారు. ముఖ్యంగా ఆహార నియమ విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటారని వివరించారు.
భర్త ఇన్ఫోసిస్ (infosys) కంపెనీని గురువారం ప్రారంభించారని గుర్తుచేశారు. తమ ఇష్ట దైవం రాఘవేంద్ర స్వామి (Raghavendra swamy) అని తెలిపారు. ఏ మంచి పని అయినా సరే ఆ రోజు ప్రారంభిస్తానని చెప్పారు. పెళ్లయిన తర్వాత అల్లుడు రిషి (Rishi) ఇదే విషయం అడిగారని గుర్తుచేశారు. తర్వాత అతను కూడా గురువారం ఉపవాసం (Fast) ఉంటున్నారని చెప్పారు. అతని తల్లి మాత్రం సోమవారం రోజున ఉపవాసం ఉంటారని తెలిపారు. తన అల్లుడి కుటుంబం 150 ఏళ్ల నుంచే లండన్లో ఉంటున్నప్పటికీ.. హిందూ సంప్రాదాయం ప్రకారం ఉంటారని తెలిపారు.
నారాయణమూర్తి- సుధామూర్తి దంపతుల కూతురు అక్షతా మూర్తిని (akshata murthy) రిషి సునక్ 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. రిషి సునక్ పూర్వీకులు భారతీయులు.. తొలి భారత సంతతి వ్యక్తి బ్రిటన్లో అత్యున్నత పదవీని చేపట్టారు.