»Crocodile Swims Out Of River Tries To Climb Over Railing In Uttar Pradeshs Bulandshahr Video Goes Viral
Crocodile : యూపీలో రైలింగ్ మీదకు ఎగబాకిన మొసలి.. తర్వాత ఏమైందంటే..?
ఉత్తర ప్రదేశ్లో గంగా నదిలో నివసించే ఓ ముసలి అనుకోకుండా బయటకు వచ్చేసింది. జనావాసాల్లో తిరుగాడింది. ఆ హడావిడికి అది మళ్లీ నదిలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అందుకు అడ్డం వచ్చిన రైలింగ్ని సైతం అది ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత ఏమైందంటే..?
crocodile : నదిలో హాయిగా తిరాగిల్సిన ఓ ముసలి పొరపాటున నీటి బయటకు వచ్చింది. అక్కడి నుంచి అది మళ్లీ నదిలోకి వెళ్లడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని(Uttar Pradesh) బులంద్ షహర్( Bulandshahr) దగ్గర జరిగింది. అక్కడి గంగానది దగ్గర నరోరా ఘాట్ సమీపంలో ఇది చోటు చేసుకుంది.
గంగా నది నుంచి పొరపాటున పది అడుగుల పొడుగున్న భారీ మొసలి(Crocodile) బయటకు వచ్చేసింది. దీంతో దాన్ని చూసిన స్థానికులంతా భయాందోళనలకు గురయ్యారు. స్థానికంగా ఉన్న అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో దాన్ని చుట్టూ జనం హడావిడికి అది భయపడింది. తిరిగి గాంగా నదిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అయతే అక్కడ నదికి అడ్డంగా ఓ రైలింగ్ ఉంది.
రైలింగ్ని తప్పించుకుని నదిలోకి వెళ్లేందుకు మొసలి ప్రయత్నించింది. అందుకు ఏకంగా రైలింగ్ పైకి ఎక్కడానికి ప్రయత్నించింది. అటవీ అధికారులు దాన్ని పట్టుకునేందుకు అలికిడి చేస్తుండటంతో అది గాబరా పడి అక్కడి నుంచి కింద పడింది. అప్పుడు కాసేపటికి దాన్ని అటవీ శాఖ సిబ్బంది సురక్షితంగా బంధించారు. తర్వాత వారే గంగా నదిలో విడిచిపెట్టారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది.